న్యూఢిల్లీ: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ మరోసారి బలపడింది. 18 పైసలు పుంజుకుని 82.41 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్రితం ముగింపు 82.59తో పోలిస్తే తొలుత 82.42 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. తదుపరి డాలరుతో మారకంలో 82.32 వరకూ లాభపడింది.
ఇంట్రాడే కనిష్టం 82.43కాగా.. చివరికి 82.41 వద్ద ముగిసింది. వెరసి గత రెండు రోజుల్లో 20 పైసలు బలపడింది. ఇందుకు ఈక్విటీ మార్కెట్లు లాభపడటం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సహకరించినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. డాలరుతో మారకంలో ఆసియా కరెన్సీలు పుంజుకోవడం సైతం రూపాయికి బలాన్నిచ్చినట్లు తెలియజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment