ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో దేశీ రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం డాలర్‌తో పోలిస్తే మరో 18 పైసలు క్షీణించి 79.9975 వద్ద క్లోజయ్యింది.
కీలక స్థాయి అయిన 80కి పైసా కన్నా తక్కువ దూరంలో నిల్చింది. టోకు ద్రవ్యోల్బణం వరుసగా 15వ నెలల జూన్‌లోనూ రెండంకెల స్థాయిలోనే కొనసాగడం, కరెంటు అకౌంటు లోటు మరింత దిగజారవచ్చన్న అంచనాలు, విదేశీ మారక నిల్వలు తగ్గనుండటం తదితర అంశాలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. గడిచిన కొద్ది రోజుల్లో క్రూడాయిల్ రేట్లు తగ్గడం .. దేశీ కరెన్సీ మరింతగా పడిపోకుండా కొంత ఊతమిచ్చినట్లు విశ్లేషకులు తెలిపారు.
గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పటిష్టంగా 79.71 వద్ద ప్రారంభమైంది. కానీ యూరప్ మార్కెట్లు ప్రారంభమయ్యాక మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు ఏకంగా 24 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగియడంతో రూపాయి పడిపోయింది. క్రితం ముగింపు 79.81తో పోలిస్తే 18 పైసలు పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment