‘మార్కెట్‌ లోకి కొత్త రూ. 500 నోట్లు’ | New 500 notes have started coming to market, says Shaktikanta Das | Sakshi
Sakshi News home page

‘మార్కెట్‌ లోకి కొత్త రూ. 500 నోట్లు’

Published Fri, Dec 2 2016 4:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

‘మార్కెట్‌ లోకి కొత్త రూ. 500 నోట్లు’

‘మార్కెట్‌ లోకి కొత్త రూ. 500 నోట్లు’

న్యూఢిల్లీ: మార్కెట్‌ లోకి కొత్త రూ. 500 నోట్లు వచ్చాయని, వీటి సరఫరాను క్రమంగా పెంచుతామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. నోట్ల కష్టాలు త్వరలోనే తీరతాయని, పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పారు. క్యాష్‌ రిజర్వు రేషియో (సీఆర్‌ఆర్‌)పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఈ నెల 9న సమీక్షిస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందోనని వేచి చూస్తున్నామన్నారు. అధికంగా ఉన్న లిక్విడిటీని ఆర్బీఐ నిర్వహిస్తుందని చెప్పారు.

కాగా, కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ. 2000 నోట్లకు చిల్లర దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం కొత్తగా విడుదల చేసిన రూ. 500 నోట్లు విరివిగా చెలామణిలోకి వస్తే చిల్లర కష్టాలు తీరతాయి. వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు. కొత్త వెయ్యి రూపాయల నోట్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement