new 500 notes
-
‘మార్కెట్ లోకి కొత్త రూ. 500 నోట్లు’
న్యూఢిల్లీ: మార్కెట్ లోకి కొత్త రూ. 500 నోట్లు వచ్చాయని, వీటి సరఫరాను క్రమంగా పెంచుతామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. నోట్ల కష్టాలు త్వరలోనే తీరతాయని, పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పారు. క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్)పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఈ నెల 9న సమీక్షిస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందోనని వేచి చూస్తున్నామన్నారు. అధికంగా ఉన్న లిక్విడిటీని ఆర్బీఐ నిర్వహిస్తుందని చెప్పారు. కాగా, కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ. 2000 నోట్లకు చిల్లర దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం కొత్తగా విడుదల చేసిన రూ. 500 నోట్లు విరివిగా చెలామణిలోకి వస్తే చిల్లర కష్టాలు తీరతాయి. వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు. కొత్త వెయ్యి రూపాయల నోట్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. -
అక్కరకు రాని ఐదొందల నోట్లు
ప్రింటింగ్ లోపాలతో వెనక్కి.. తమకు ఇవ్వాలంటూ నల్లదొరల రాయ’బేరాలు’ 597 బ్యాంక్ శాఖలకు రూ.60 కోట్లు విడుదల సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాకు వచ్చిన రూ.500 నోట్లు ప్రజలకు అక్కరకు రాకుండా పోయాయి. నాలుగు రోజుల క్రితమే జిల్లాకు పెద్ద మొత్తంలో రూ.500 నోట్లు వచ్చిన విషయం విదితమే. వాటిలో కొన్ని నోట్లపై ప్రింటింగ్ లోపాలు ఉన్నట్టు గుర్తించామని, ఆ కారణంగా వెనక్కి పంపుతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఆర్బీఐకి తిరిగి పంపగా మిగిలిన నోట్లలో రూ.60 కోట్లను మంగళవారం జిల్లాలోని బ్యాంకులకు పంపించారు. ఇంకా సుమారు రూ.150 కోట్ల వరకు నోట్లు ఇక్కడే ఉంచేశారు. వాటిని బ్యాంక్ శాఖలకు పంపించవద్దని, తమకు ఇవ్వాలని జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కోరడంతో నిలిపివేశారనే ప్రచారం జిల్లాలో పెద్దఎత్తున సాగుతోంది. జిల్లాలోని 597 బ్యాంక్ శాఖలకు రూ.10 లక్షల చొప్పున రూ.60 కోట్లను పంపించగా, బుధవారం నుంచి అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కమీషన్ల ఎరవేసి మార్చేశారు ఇప్పటికే చాలామంది ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకర్ల సహాయంతో మార్చినట్టు సమాచారం. బ్యాంకర్లకు 20 నుంచి 30 శాతం కమీషన్ ముట్టచెప్పి పాత నోట్లను మార్చుకున్నట్టు భోగట్టా. పాత నోట్ల మార్పిడిని అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున జిల్లాలోనూ, చుట్టుపక్కల జిల్లాల్లో ఈ దందా నడిచింది. హనుమాన్ జంక్షన్‌లోని ఒక ప్రధాన బ్యాంక్ మేనేజర్ ఒక చేపల వ్యాపారికి రూ.20 శాతం కమీషన్ తీసుకుని రూ.35 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. పెద్దగా లావాదేవీలు ఉండని బ్యాంకుల్లో ఛత్తీస్గడ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల వారినుంచి 20 శాతం కమీషన్ తీసుకుని పెద్ద ఎత్తున నోట్లను మార్చారు. ఇంకొందరు ప్రజాప్రతినిధులు ఒక అడుగు ముందుకు వేసి దేవుడి హుండీలలో వచ్చిన చిన్న నోట్లను తీసుకుని వాటి స్థానంలో పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పటికే 80 శాతంపైగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారని సమాచారం. ఎటొచ్చి పేద, మధ్య తరగతి ప్రజలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ప్రజలకు కష్టాలు పెరుగుతున్నాయి. నిత్యవసర సరుకులు కొనుక్కునేందుకు సైతం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల వద్ద నిలబడలేక, ఏటీఎంలు పనిచేయక వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. 21 రోజుల తర్వాత కూడా బ్యాంకుల వద్ద జనం బారులుతీరి ఉంటున్నారు. అక్కడక్కడా పనిచేస్తున్న ఏటీఎంలలో ఇప్పటికీ రూ.2 వేల నోట్లు మాత్రమే వస్తుండటంతో ప్రజల కష్టాలు తీరడం లేదు. -
బ్యాంకులకు కొత్త 500 నోట్లు వచ్చేశాయి!
-
బ్యాంకులకు కొత్త 500 నోట్లు వచ్చేశాయి!
ఏపీలో కొనసాగిన నోట్ల కష్టాలు.. అమరావతి: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లుగా నగదు సరఫరా లేకపోవడంతో బుధవారం కూడా ప్రజలు ఇబ్బందులు కొనసాగాయి. పరిమితులకు లోబడి ఖాతాదారులు అడిగిన సొమ్మును సైతం బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి. అడిగిన దాంట్లో మూడోవంతు మాత్రమే సర్దుతున్నాయి. రూ. పదివేలు అడిగితే మూడువేలకు మించి ఇవ్వలేని పరిస్థితి. కొన్ని బ్యాంకుల్లో అయితే ముందుగా టోకెన్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు టోకెన్లు తీసుకొని రెండు రోజుల తర్వాత నగదు తీసుకోవడానికి రమ్మంటుండటంతో ఖాతాదారుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. అయితే, కొత్త నోట్లకు అనుగుణంగా 50 శాతానికిపైగా ఏటీఎంలను మార్పుచేసి.. అందుబాటులోకి తీసుకోవడంతో అక్కడ రద్దీ కొంతతగ్గింది. చాలా ఏటీఎంల నుంచి కేవలం రెండు వేల నోట్లు వస్తుండటంతో వాటిని తీసుకోవడానికి జనం ఆసక్తి చూపడం లేదు. దీంతో ఏటీఎంల వద్ద రద్దీ కనిపించడం లేదని చెప్తున్నారు. ఆర్బీఐ నుంచి అదనపు నిధులు ఆర్బీఐ నుంచి అదనపు నిధులు వచ్చాయని, వాటిని బుధవారం బ్యాంకులకు సరఫరా చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్లోని ఆంధ్రాబ్యాంక్‌కు రూ. 60 కోట్లతోపాటు, రూ. 20 కోట్ల విలువైన 500 నోట్లు వచ్చాయి. బ్యాంకుకు కోటి రూపాయల చొప్పున రూ.500 నోట్లు పంపిణీ చేసినట్లు ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నగదు చేరడంతో గురువారం నుంచి నగదు కొరత కొంతమేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.