ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఈటీఎఫ్‌ | ICICI Prudential MF launches India first oil and gas ETF | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఈటీఎఫ్‌

Published Mon, Jul 15 2024 5:52 AM | Last Updated on Mon, Jul 15 2024 9:14 AM

ICICI Prudential MF launches India first oil and gas ETF

ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నిఫ్టీ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఈటీఎఫ్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. నిఫ్టీ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ మాదిరే ఈ పథకం రాబడులు అందిస్తుందని తెలిపింది. నిఫ్టీ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌లో 15 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం రంగంలో సేవలు అందిస్తున్నవి.

 సూచీలో ఈ కంపెనీలకు వెయిటేజీకి అనుగుణంగానే ఈ పథకం కూడా పెట్టుబడులు పెడుతుంది. తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ఉండడం, ఆయిల్, గ్యాస్‌ వినియోగానికి డిమాండ్‌ పెరుగుతుండడం పెట్టుబడులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈటీఎఫ్‌ 18వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement