ఆదిత్య బిర్లాసన్‌లైఫ్‌ నుంచి నిఫ్టీ హెల్త్‌కేర్‌ ఈటీఎఫ్‌ | Aditya Birla Sun Life Mutual Fund launches ABSL Nifty Healthcare ETF | Sakshi
Sakshi News home page

ఆదిత్య బిర్లాసన్‌లైఫ్‌ నుంచి నిఫ్టీ హెల్త్‌కేర్‌ ఈటీఎఫ్‌

Published Mon, Oct 11 2021 12:50 AM | Last Updated on Mon, Oct 11 2021 1:06 AM

Aditya Birla Sun Life Mutual Fund launches ABSL Nifty Healthcare ETF - Sakshi

ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. నూతనంగా ‘ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ నిఫ్టీ హెల్త్‌కేర్‌ ఈటీఎఫ్‌’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. నిఫ్టీ హెల్త్‌కేర్‌ టీఆర్‌ఐ ఇండెక్స్‌ను అనుసరించి పెట్టుబడులు పెడుతుంది. ఈ నెల 8న మొదలైన ఈ పథకంలో 20వ తేదీ వరకు ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్‌) రంగంలో ఉన్న అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసే విధంగా ఈ పథకం పనిచేస్తుంది.

నిఫ్టీ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌లో 20 వరకు కంపెనీలున్నాయి. వీటిల్లో ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ ఎండీ, సీఈవో ఏ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఆదాయం, ఎగుమతులు, ఉపాధి కల్పన పరంగా హెల్త్‌కేర్‌ కూడా దేశంలో ఒకానొక ముఖ్య మైన రంగంగా అవతరించింది. ఈ వృద్ధి లిస్టెడ్‌ కంపెనీల్లోనూ ప్రతిఫలించాల్సి ఉంది. ఇది ప్యాసివ్‌ పథకం. కనుక వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఈ రంగం వృద్ధిలో పాల్గొనేందుకు ఈ పథకం ఒక చక్కని మార్గం అవుతుంది’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement