ఈటీఎఫ్ అంటే..
ఫైనాన్షియల్ బేసిక్స్..
ఈటీఎఫ్ అంటే ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. ప్రతి విషయంలోనూ మ్యూచువల్ ఫండ్‌లానే ఉంటుంది. అయితే మ్యూచ్‌వల్ ఫండ్ల మాదిరి కాకుండా ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్‌లో షేర్లను ఎలాగైతే కొనుగోలు చేస్తారో అలాగే బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా డైరెక్ట్‌గా ఈటీఎఫ్‌లలో షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజ్‌లలో ట్రేడ్ అవుతాయి. ఉదయం కొని సాయంత్రం విక్రయించొచ్చు కూడా. తక్కువ వ్యయాలు, పన్ను రాయితీలు, డైవర్సిఫికేషన్, స్టాక్స్‌కు ఉండే సౌకర్యాలను కలిగి ఉండటం వంటి పలు ప్రయోజనాల నేపథ్యంలో ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్‌మెంట్లకు అనువుగా ఉంటాయి. ఇవి 1993 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈటీఎఫ్‌లు స్టాక్స్, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీ, ఆప్షన్స్ వంటి పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడులు చేస్తాయి. ప్రధానంగా మాత్రం స్టాక్ సూచీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి.