![Gold Exchange Traded Funds Witnessed Of Rs 457 Crore In July - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/10/gold_0.jpg.webp?itok=yWwPtGuA)
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ జూలైలో నికరంగా రూ.457 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. పోర్టుఫోలియో రీబ్యాలెన్సింగ్ ప్రణాళికలో భాగంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వంటి రక్షణాత్మక విభాగాల్లోకి మళ్లించడం కలిసొచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపారు.
ఈ జూన్‌లో రూ.135 కోట్లు మాత్రమే వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి)గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2022) జూలై నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.982 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
‘‘యాంఫీ గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.., బంగారాన్ని పెట్టుబడుల వైవిధ్య సాధనంగా చూసే ధోరణి పెరిగింది. ఇన్వెస్టర్లు మార్కెట్ అస్థిరతలకు హెడ్జ్ సాధనంగా పరిగణిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం అంశాలు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై ప్రభావాన్ని చూపుతున్నాయి’’ అని ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతి రాతి గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment