న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు గత నెల పసిడి ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో (ఈటీఎఫ్) గణనీయంగా ఇన్వెస్ట్ చేశారు. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల ప్రకారం రూ. 124 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంతకు మందు నెల మార్చ్‌లో రూ. 266 కోట్లు ఉపసంహరించుకున్నారు.
సంపన్న ఎకానమీల్లో ఇంకా రిస్కులు కొనసాగుతున్నందున గోల్డ్ ఈటీఎఫ్‌లవైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. డేటా ప్రకారం పసిడి ఆధారిత 14 ఈటీఎఫ్‌ల్లోకి గత నెల రూ. 124.54 కోట్లు వచ్చాయి. దీంతో పసిడి ఈటీఎఫ్‌ల నిర్వహణనలోని ఆస్తుల పరిమాణం రూ. 22,950 కోట్లకు చేరింది.
మార్చి నెలాఖరులో ఇది రూ. 22,737 కోట్లు. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోల సంఖ్య 12,600 పెరిగి 47.13 లక్షలకు చేరింది. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 653 కోట్ల పెట్టుబడులు వచ్చాయ. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2021–22లో నమోదైన రూ. 2,541 కోట్లతో పోలిస్తే 74 శాతం క్షీణించాయి. ప్రధానంగా లాభాల స్వీకరణ, ఇన్వెస్టర్లు .. ఈక్విటీలవైపు మొగ్గు చూపడం ఇందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment