
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్ జారీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లను సమీకరించింది. రూ.3,500 కోట్ల కనీస సమీకరణతో గురువారం ఈ ఇష్యూను అందుబాటులో ఉంచగా, సాయంత్రం 7 గంటల వరకు పది రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రిటైల్ విభాగం సహా అన్ని కేటగిరీల్లో అధిక స్పందన వచ్చిందని, దీంతో రూ.10,000 కోట్ల మేర నిధులను అట్టే పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే భారత్–22 ఈటీఎఫ్ తాజా ఇష్యూ నిర్వహించడం జరిగింది. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.22,900 కోట్లను రాబట్టుకుంది. 2017 నవంబర్లో రూ.14,500 కోట్లు, 2018 జూన్‌లో రూ.8,400 కోట్ల సమీకరణ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment