
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహోపకరణాల తయారీ సంస్థ గోద్రెజ్ నూతన శ్రేణి ఏసీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 38 రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. చల్లదనం కోసం పర్యావరణ అనుకూల ఆర్290, ఆర్32 ద్రావణాలను ఏసీల్లో వినియోగిస్తున్నామని, ఆర్290ను భారత్‌లో తొలిసారిగా తామే వాడామని గోద్రెజ్ అప్లయెన్సెస్ నేషనల్ సేల్స్ హెడ్ సంజీవ్ జైన్ చెప్పారు. సౌత్ బిజినెస్ హెడ్ వెంకటరామన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో గోద్రెజ్ అప్లయెన్సెస్ రూ.4,000 కోట్ల టర్నోవర్ నమోదు చేయనుంది. 2019– 20లో 25 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. ఏసీల విభాగం వాటా గతేడాది మాదిరిగానే 20 శాతం ఉంటుంది’ అని వివరించారు.