గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆనాసక్తి
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లపై ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2016–17) ఈ ఇన్‌స్ట్రుమెంట్ నుంచి ఇన్వెస్టర్లు రూ.775 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సోమవారం నాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగడం వరుసగా ఇది నాల్గవ ఏడాది.
వరుసగా నాలుగు సంవత్సరాల్లో ఉపసంహరణల మొత్తం తగ్గుతుండటం గమనార్హం. అసెట్ క్లాస్‌గా ఈక్విటీల్లోకి ఇన్వెస్ట్‌మెంట్లు మళ్లించడమే ఈటీఎఫ్‌ల నుంచి ఉపసంహరణలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క గడచిన ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్క అక్టోబర్ మినహా ప్రతి నెలలోనూ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్లు వెనక్కు మళ్లాయి. పండుగల సీజన్ వల్ల అక్టోబర్‌లో ఇన్‌ఫ్లోస్ జరిగినట్లు మ్యూచువల్ ఫండ్ రిసెర్చ్ సంస్థ– ఫండ్స్ ఇండియా.
కామ్ హెడ్ విద్యా బాల అంచనావేశారు. గోల్డ్ ధరల ఆధారంగా రాబడులను అందించే ఇన్‌స్ట్రు మెంట్లే గోల్డ్ ఈటీఎఫ్‌లు. ప్రత్యక్షంగా పసిడి ధరతో ముడివడి ఉన్నందున, ఈ ప్రొడక్ట్‌లో పూర్తి పారదర్శకత ఉంటుంది. భారత్ మ్యూచువల్ ఫండ్ రంగంలో 2006–07 నుంచీ 14 గోల్డ్–ఆధారిత స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.