డిజిటల్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ పై అనేక ప్రపంచ దేశాలు, సెంట్రల్ బ్యాంకుల ఆంక్షల విధించిన కరోనా మహమ్మారి కాలంలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. రూ.35 లక్షలు దాటిన బిట్ కాయిన్ ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం అన్ని దేశాల ఆమోదం నిదానంగా పొందుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సేవల సంస్థలైన జేపీ మోర్గాన్, వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ మద్దతునూ కూడా పొందింది. తాజాగా బంగారం మాదిరే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు కెనడాకు చెందిన ప్రధాన సెక్యూరిటీ రెగ్యులేటర్ ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ అనుమతి ఇచ్చింది.
ఇప్పుడు కెనడాలో బంగారం మాదిరే బిట్ కాయిన్ కొనుగోలు చేయవచ్చు. ఈటీఎఫ్ ప్రపంచంలోనే బౌతికంగా బిట్ కాయిన్‌తో పెట్టుబడి పెట్టడానికి, ఇన్వెస్టర్లు తేలిగ్గా పొందడానికి ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ వెసులుబాటు కల్పిస్తున్నది. బిట్‌కాయిన్ శుక్రవారం రికార్డు స్థాయిలో $ 48,975కు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 63శాతం పెరిగింది. 2020 మార్చి నుండి సుమారు 1,130 శాతం పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిపెట్టినట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment