Has RBI Really Endorsed Crypto Transactions In India- Sakshi
Sakshi News home page

డిజిటల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కాస్త ఊరట

Published Tue, Jun 1 2021 2:08 PM | Last Updated on Tue, Jun 1 2021 2:26 PM

Has RBI really endorsed crypto transactions in India - Sakshi

న్యూఢిల్లీ: వర్చువల్‌ కరెన్సీ ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చేలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్స్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ సూచనలు జారీ చేసింది. ఈ తరహా కరెన్సీ లావాదేవీలు జరిపే కస్టమర్లకు సర్వీసులు అందించరాదంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌పై వివరణనిచ్చింది. ఈ సర్క్యులర్‌ను 2020లో సుప్రీంకోర్టు తోసి పుచ్చినందున అప్పట్నుంచి ఇది అమల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో వర్చువల్‌ కరెన్సీ లావాదేవీలు నిర్వహించే వారికి సర్వీసులను అందించకుండా ఉండటానికి ఈ సర్క్యులర్‌ను అడ్డుగా చూపరాదని స్పష్టం చేసింది. అయితే, కస్టమర్ల ఖాతాల వివరాల వెల్లడి (కేవైసీ), యాంటీ మనీ లాండరింగ్‌ తదితర చట్టాల నిబంధనలను పాటించాలని బ్యాంకులు మొదలైన వాటికి ఆర్‌బీఐ సూచించింది.

చదవండి: విమానయానం, ఆక్సిజన్‌ ప్లాంట్లకూ రుణ హామీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement