డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పై ఫైనాన్షియల్ సర్వీసులు అందించే పేటీఎం సంస్థ తన మార్కెట్‌ను మరింత విస్త్రృతం చేసుకునే పనిలో ఉంది. వివాస్పద క్రిప్టోకరెన్సీ సేవలు దేశంలో ప్రారంభించేందుకు తాము సిద్ధమంటోంది.
చాపకింద నీరులా
ఆర్థిక రంగంలో ఎక్కువ మందికి అర్థం కాకపోయినా, చాలా మందికి పరిచయం లేకపోయినా సరే చాప కింద నీరులా మార్కెట్‌లో విస్తరిస్తోంది క్రిప్టో కరెన్సీ, పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండే ఈ కరెన్సీతో పై స్థాయిలో భారీగానే లావాదేవీలు జరుగుతున్నాయి. ఆర్థిక నిపుణులు, బడా వ్యాపారవేత్తలు సైతం భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ హవా ఉంటుందంటున్నారు. కొందరు పెట్టుబడులు సైతం పెడుతున్నారు.
క్రిప్టో కరెన్సీ
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేసే క్రిప్టోకరెన్సీ విభాగంలో అనేక డిజిటల్ కాయిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్, ఇథేరియమ్, బినాన్స్, టెథర్, కార్డానో, సొలానో, ఎక్స్‌ఆర్‌పీ, పొల్కడాట్ ఇలా అనేకం ఉన్నాయి. వీటిలో బిట్ కాయిన్ వరల్డ్ వైడ్‌గా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో బాగా ఫేమస్.
ముందుగా బిట్‌కాయిన్
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీకి చట్టపరమైన అనుమతులు ఇస్తే బిట్ కాయిన్ ట్రేడింగ్‌కి తాము సిద్దమేనంటూ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ప్రకటించింది. ‘ ప్రభుత్వం దృష్టిలో క్రిప్టో కరెన్సీ ఇంకా గ్రే ఏరియాలో ఉంది. ఈ ఏరియా నుంచి తొలగించి, చట్టపరమైన అనుమతులు ఇస్తే ముందుగా బిట్‌కాయిన్‌ని పేటీఎంలో అందుబాటులో ఉంచుతాం’ అని పేటీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మధుర్ దేవ్‌రా తెలిపారు.
సుప్రీం తీర్పుతో
ప్రభుత్వ నిబంధనలకు లోబడని క్రిప్టో కరెన్సీతో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో.. ఈ తరహా లావాదేవీలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2020 మార్చిలో తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్రిప్టో కరెన్సీకి ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు లేదు. అయితే ఈ మార్కెట్‌పై ఉత్సాహం ఉన్న అనేక మంది రిస్క్ తీసుకుని క్రిప్టోపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.
రక్షణపై సందేహాలు
స్టాక్ మార్కెట్, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహాణలు అన్నీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి జరుగుతుంటాయి. ఇందులో మోసాలను అరికట్టి వ్యవస్థ సాఫీగా సాగిపోవడానికి అనుగుణంగా పలు ప్రభుత్వ విభాగాలు పని చేస్తుంటాయి, అయితే సాధారణంగా బిగ్ ప్లేయర్లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటారు. చట్టాలకు చిక్కకుండా నిఘా నేత్రం ఆవల వీరు మార్కెట్‌ని మానిప్యులేట్ చేస్తారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీలో వ్యక్తుల ప్రభావం ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆజమాయిషీ కూడా ఉండదు. దీంతో ఇందులో పెట్టే డబ్బులకు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా రక్షణ ఉండదు. అందువల్ల క్రిప్టో కరెన్సీ భద్రతపై అనేక సందేహాలు ఉన్నాయి.
చదవండి:బ్యాంకుల్లో క్రిప్టో కరెన్సీపై ట్రాన్సాక్షన్లు, మాస్టర్ కార్డ్ గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment