
ముంబై: గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో బాండ్ల నష్టాల కేటాయింపులకు సంబంధించి బ్యాంకులకు ఆర్‌బీఐ కొంత ఊరటనిచ్చింది. వీటికి ప్రొవిజనింగ్‌ను ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు త్రైమాసికాల్లో సమంగా చూపించుకునేలా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ బాండ్లపై యీల్డ్‌లు ఒక్కసారిగా ఎగియడం వల్ల వాటిల్లిన నష్టాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం పడకుండా చూసే ఉద్దేశంతో.. ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అలాగే, భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తినా సమర్ధంగా ఎదుర్కొనగలిగేలా ప్రత్యేక రిజర్వ్‌ను (ఐఎఫ్‌ఆర్) ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకులకు..గత రెండు త్రైమాసికాల్లో బాండ్లపై ఈల్డ్ భారీగా పెరిగిపోవడం వల్ల గణనీయంగా నష్టాలు వాటిల్లాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఈ నష్టాలు రూ. 15,000 కోట్లు ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీల అంచనా. పూర్తి సంవత్సరం గణాంకాలు ఇంకా లెక్కించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment