లాహోర్: 75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ కలుసుకున్నారు. చిన్నతనంలో వేరుపడిన అక్క, తమ్ముడిని సామాజిక మాధ్యమాలు వృద్ధాప్యంలో కలిపాయి. ఇటీవల వీరిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. పంజాబ్‌కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో చెల్లాచెదురైంది.
కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరగా కూతురు మహేంద్ర కౌర్ భజన్ సింగ్ వెంటే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంచుకున్నారు. పంజాబ్‌లో ఉండే మహేంద్ర కౌర్ (81), పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ (78) స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. ఆలింగనాలు, ఆనంద బాష్పాలతో ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని డాన్ పత్రిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment