
మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అక్కా తమ్ముడు సెల్పీ తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కెనెడాలో మ్యాపెల్ లీప్స్, పిట్స్‌బర్గ్ పెంగ్విన్స్ మధ్య జరిగిన హాకీ మ్యాచ్ చూడడానికి కోస్టా బౌరికాస్(17), ప్యాట్రిసియా బౌరికాస్(20) వచ్చారు. మ్యాచ్ వీక్షిస్తూనే మధ్యలో ఓ సెల్పీ తీసుకున్నారు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా! మీరు ఆ వీడియోనూ జాగ్రత్తగా గమనిస్తే.. అసలు విషయం మీకే అర్థం అర్థమవుతుంది. సెల్పీ తీసుకుంటున్న సమయంలో ఓకేసారి నవ్విన వీరిద్దరూ అది పూర్తవ్వగానే సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అయితే వీరిద్దరు నవ్వు నుంచి సీరియస్ మోడ్‌లోకి ఒకే సమయంలో మారడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో 28.8 లక్షల మిలియన్‌వ్యూస్ వచ్చాయి. అయితే వీడియో చూసిన కొందరు నెటిజన్లు వీరిద్దరిని భార్యభర్తలేమే అనుకున్నారు. అయితే నెటిజన్లు పెట్టిన కామెంట్లకు 20 ఏళ్ల ప్యాట్రిసియా బౌరికాస్ స్పందిస్తూ.. వాడు నా తమ్ముడని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.
😂 #Leafs #HNIC pic.twitter.com/GdwrxEomG6
— Kevin Doherty (@magictoasterfi1) November 17, 2019
Comments
Please login to add a commentAdd a comment