
కెనడా: భలే ఫ్యామిలీ వీళ్లది! దేవుడి అనుగ్రహం దివ్యంగా ఉన్నట్లుంది. తొమ్మిది మంది అక్కచెల్లెళ్లు. ముగ్గురు అన్నదమ్ములు. అంతా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం వీళ్లలో అందరికన్నా చిన్న వారి వయసు 75 ఏళ్లు. అందరికన్నా పెద్దవారి వయసు 97 ఏళ్లు. ఉత్సాహంగా మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. ఇప్పుడైతే ఇక ‘ఈ భూమండలంపై జీవించి ఉన్నవారిలో సహోదరులందరి వయసునూ కలుపుకుని 1042 ఏళ్ల వయసు కలిగిన వారిగా’ గిన్నిస్ బుక్‌లోకీ ఎక్కారు. ఆ సందర్భంగా చిరునవ్వులు చిందిస్తూ ఒక గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. వీళ్లది కెనడా. ఉండటం వేర్వేరు దేశాల్లో అయినా ఈ నెల 15న తమ కోసం గిన్నిస్ వాళ్లు వస్తున్నారంటే కెనడాలోని పుట్టింటికి చేరుకున్నారు. లోకల్‌గా వీళ్లకు ‘డీక్రజ్ తోబుట్టువులు’ అని పేరు. డీక్రజ్ అనేది వాళ్ల ఇంటిపేరు. మూడేళ్లకోసారి సెలవులకు వీరంతా కలుస్తుంటారట. చదవండి: ఈయూలో టీకా షురూ
Comments
Please login to add a commentAdd a comment