తాగి ప్రపోజ్‌ చేశాడు: సింగర్‌ | Neha Kakkar Says Rohanpreet Singh Drunkenly Proposed One Day | Sakshi
Sakshi News home page

తాగి ప్రపోజ్‌ చేశాడు: సింగర్‌

Published Thu, Dec 24 2020 6:05 PM | Last Updated on Thu, Dec 24 2020 6:23 PM

Neha Kakkar Says Rohanpreet Singh Drunkenly Proposed One Day - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్లు నేహా కక్కర్-రోహన్‌ప్రీత్‌ సింగ్‌ వివాహం అక్టోబర్‌ 24న స్వల్ప అతిథుల మధ్య ఘనంగా జరిగింది. అయితే మరీ ఇంత తొందరగా పెళ్లి చేసుకునేందుకు రోహన్‌ రెడీగా లేరట. కానీ ఓ రోజు మాత్రం పూటుగా మద్యం తాగి పెళ్లి చేసుకుందాం అని తన ప్రియురాలు నేహాకు మెసేజ్‌ పెట్టాడట. మొదట దీన్ని నేహా నమ్మలేదట, కానీ తర్వాత నమ్మక తప్పలేదు. మరి ఇంతలోనే అంత మార్పు రావడానికి కారణమేంటో నేహా మాటల్లోనే తెలుసుకుందాం.. 

పెళ్లి కుదరదన్నాడు
"ఓ రోజు షూటింగ్‌ పూర్తయ్యాక రోహన్‌ నా స్నాప్‌చాట్‌ ఐడీ అడిగాడు. అలా మా మధ్య మాటలు కలిశాయి. ప్రేమ పాఠాలు కూడా నడిచాయి. జీవితంలో సెటిల్‌ అవ్వాల్సిన సమయం వచ్చిందనిపించి పెళ్లి చేసుకుందాం అని అడిగాను. దీనికి అతడు ససేమీరా ఒప్పుకోలేదు. నాకింకా పాతికేళ్లే.. అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరం మాట్లాడుకోవడమే మానేశాం. అలా కొంతకాలం గడిచింది. సడన్‌గా ఓ రోజు నేహూ, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పాడు. నాకెందుకో నమ్మాలనిపించలేదు" (చదవండి: రాథోర్‌ పాటలకు పడి పోవాల్సిందే!)

తాగిన మత్తులో ప్రపోజ్‌ చేశాడనుకున్నా
"ఎందుకంటే అప్పుడే రెండు, మూడు బీర్లు తాగాడు. తాగిన మత్తులో ఇలాంటి డైలాగులు కొడుతున్నాడు, కానీ తెల్లారేసరికి మర్చిపోతాడు అని లైట్‌ తీసుకున్నాను. తర్వాతి రోజు నేను షూటింగ్‌ కోసం ఛండీఘర్‌ వెళ్లాను. రోహన్‌ అక్కడ నా రూమ్‌కు వచ్చి నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుందా? అని అడిగాడు. నువ్వు తాగితే నేనెందుకు మర్చిపోతాను అని చెప్పాను. కానీ ఆ క్షణమే అర్థమైంది. రోహన్‌ నిజంగానే పెళ్లికి రెడీ అయ్యాడని! వెంటనే నేను మా అమ్మతో మాట్లాడమని చెప్పాను. వాళ్లు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు" అని నేహా చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య నెట్టింట నేహా బేబీ బంప్‌ ఫొటోలు దర్శనమివ్వడంతో ఆమె తల్లి కాబోతుందంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే అదంతా లేటెస్ట్‌ సాంగ్‌ 'ఖ్యాల్‌ రఖ్యా కర్‌' కోసమేనని తెలియడంతో అభిమానులు అవాక్కయ్యారు. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ సాంగ్‌ జనాలను ఆకట్టుకుంటోంది. (చదవండి: నేహా కక్కర్‌-రోహాన్‌ ప్రీత్‌సింగ్‌ల పెళ్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement