
ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ప్రముఖ సింగర్లు నేహా కక్కర్- రోహన్‌ప్రీత్‌సింగ్ ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జంటగా వెళ్లారు. అక్కడ రోహన్.. నేహాను కలిశాక తన జీవితం ఎలా మారిపోయిందో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తన స్పీచ్‌తో అక్కడున్న జడ్జిలతో పాటు సతీమణికి సైతం కంటతడి పెట్టించారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. 'నేను తలపాగా కట్టుకుంటున్న సమయంలో నేహా మేనేజ్‌మెంట్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేహా తర్వాతి సాంగ్‌లో మీరు నటిస్తారా అని! అసలు దానికోసం ప్రత్యేకంగా అడగాలా? అని బదులిచ్చాను' (చదవండి: సమంతకు నో చెప్పిన నాగచైతన్య!)
'అలా నేను ఓ రోజు గదిలో అడుగు పెట్టగానే నేహూ తల తిప్పి నావైపు చూసింది. ఆ క్షణం నా జీవితాన్నే మార్చేసింది. ఆమె 'నేహు కా వ్యాహ్' అనే పాట రాసిందని మీరంటారు, కానీ నా తలరాతను కూడా ఆమె రాసిందని నేనంటాను. నేను ఇప్పుడు ఇలా స్టేజీ మీద నిలబడటానికి కారణం నేహూనే అని సగర్వంగా చెప్తాను' అని ముగించడంతో నేహా కక్కర్ కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను 'నన్ను ఏడిపించారు' అన్న క్యాప్షన్‌తో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా నేహు దా వ్యాహ్ సాంగ్ రిలీజైన నెల రోజులకే నేహా కక్కర్- రోహన్ ప్రీత్‌సింగ్ ముంబైలో రోకా ఫంక్షన్ జరుపుకున్నారు. తర్వాత ఢిల్లీలో హల్దీ, మెహందీ వేడుకలతో పాటు అక్టోబర్ 23న సంగీత్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాతి రోజే వేలు పట్టుకుని ఏడడుగులు నడిచారు. (చదవండి: తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్)
Comments
Please login to add a commentAdd a comment