Shraddha Kapoor and Rumoured Rohan Shrestha Break Up After 4 Years Long Relationship - Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: బాలీవుడ్‌ బ్యూటీ బ్రేకప్‌.. బర్త్‌డే పార్టీతో తెలిసిన అసలు నిజం!

Published Fri, Mar 25 2022 1:31 PM | Last Updated on Fri, Mar 25 2022 3:43 PM

Shraddha Kapoor and Rumoured Rohan Shrestha Break Up After 4 Years - Sakshi

Shraddha Kapoor Rohan Shrestha Break Up: చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోవడం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో బ్రేకప్‌ కహానీలు మరీ ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ప్రియుడికి బ్రేకప్‌ చెప్పేసింది. బాయ్‌ఫ్రెండ్‌ రోహన్‌ శ్రేష్టతో నాలుగేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ అతడి నుంచి విడిపోయింది. దీనిపై ఇంతవరకు ఇద్దరూ స్పందించలేదు.

గత కొన్నాళ్లుగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ రోషన్‌ శ్రేష్ట- శ్రద్దా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పార్టీలు, పబ్‌లు, టూర్స్‌ అంటూ పలుమార్లు మీడియాకు చిక్కిన వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల లవ్‌స్టోరీకి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. అయితే విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

ఇటీవలె గోవాలో శ్రద్దాకపూర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితుల,సన్నిహితులు అంతా హజరయ్యారు. కానీ ప్రియుడు రోహన్ మాత్రం హాజరు కాలేదు. సోషల్ మీడియాలో కూడా రోహాన్‌ బర్త్‌డే విషెస్‌ చెప్పలేదు. దీంతో వీరిద్దరి బ్రేకప్‌ నిజమేనని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement