‘‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు మంగళం. తర్వాత ఏమవుతుందో అని ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్ (సుమంత్ అశ్విన్)తో కలిసి మంగళం బ్యాచిలర్ ట్రిప్‌కి గోవా వెళతాడు. ఆ ట్రిప్‌లో ఏం జరిగింది? అనేది ‘7 డేస్ 6 నైట్స్’ కథ’’ అని రోహన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజవుతోంది.
(చదవండి: వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!)
ఈ సందర్భంగా రోహన్ మాట్లాడుతూ– ‘‘నా షో రీల్ చూసిన సునీల్‌గారు ఎంఎస్ రాజుగారికి చూపించారట. రెండు ఆడిషన్స్ తర్వాత నన్ను ఫైనలైజ్ చేశారు రాజుగారు. తొలి సినిమాకే కామెడీ చేయడం కష్టం అనుకున్నాను. అయితే ఎంఎస్ రాజుగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో చేశాను. మంగళం పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడాలి.. అందుకోసం ఈ మధ్య వచ్చిన తెలంగాణ యాస చిత్రాలు చూశాను. నా నిజజీవితానికి ఆపోజిట్‌గా ఉండే మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోగానే చేయాలనుకోవడం లేదు.. కథలో ఇంపార్టెన్స్ ఉంటే ముఖ్య పాత్రలు కూడా చేస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment