‘‘7 డేస్ 6 నైట్స్’ ఒక ఫన్ ఫిల్మ్. టీనేజ్, యంగ్‌స్టర్ వైబ్స్ ఉన్న కథ. ఎంఎస్ రాజుగారి సినిమాలు చూశాను. ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యాను. కథ కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను’’ అని హీరోయిన్ మెహర్ చాహల్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను అస్సాంలో పుట్టాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో పని చేయడం వల్ల దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను.
చదవండి: డేటింగ్ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు
ప్రస్తుతం నా తల్లిదండ్రులతో కలిసి కోల్‌కతాలో ఉంటున్నాను. అయితే సినిమాల కోసం ముంబైలో ఉన్నాను. ముంబైలో నన్ను చూసిన ఎంఎస్ రాజుగారు మా మేనేజర్‌తో మాట్లాడారు. హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను.. సెలెక్ట్ చేశారు. ‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు రతికా. సుమంత్ అశ్విన్‌కి జోడీగా కనిపిస్తాను. ఇందులో నాది బోల్డ్ రోల్ కాదు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. హిందీలో ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌లో జోక్స్ ఎలా ఉంటాయో ఇందులోనూ అలా ఉంటాయి.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఫుల్‌గా నవ్వుకోవచ్చు. యూత్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment