నా కొడుకు ఎక్కడ? | Where is my son? | Sakshi
Sakshi News home page

నా కొడుకు ఎక్కడ?

Published Thu, Feb 5 2015 12:56 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

నా కొడుకు ఎక్కడ? - Sakshi

నా కొడుకు ఎక్కడ?

పెనమలూరు :  రొయ్యూరు వద్ద కారు ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడిన పద్మ ఆస్పత్రిలో ‘నా కొడుకు రోహణ్ ఎక్కడ.. క్షేమంగా ఉన్నాడా..’ అని ప్రశ్నింది. కొడుకు కాలువలో గల్లంతైన విషయం ఆమెకు చెప్పలేక, ఏంచెప్పాలో అర్థంగాక బంధువులు ఆందోళనకు గురయ్యారు. భర్త చనిపోయిన విషయం కూడా ఆమెకు చెప్పలేదు. ఇంటి వద్దే ఉన్న మరో కుమారుడు చరణ్ (5) ఆస్పత్రికి నాయనమ్మతో వచ్చి ‘డాడీ ఏడీ.. మమ్మీ ఎక్కడ..’ అని రోదించటంతో అక్కడకు వచ్చిన పోలీస్ సిబ్బంది, బంధువులు కంటతడి పెట్టారు.

 ఈ మధ్యే ఇల్లు కొన్నాడు

మృతుడు సోమశేఖర్ ఇటీవలే పటమట డొంకరోడ్డులో అపార్టుమెంట్ కొన్నాడని అతని మిత్రువులు తెలిపారు. అతని సోదరి లక్ష్మీసౌజన్య నెదర్లాండ్స్‌లో ఉంటున్నారు. ఆమె సంక్రాంతి పండుగకు రాగా, ఆమెను గత కొద్ది రోజుల క్రి తమే చెన్నైకి వెళ్లి  విమానం ఎక్కించి వచ్చాడని తెలిపారు. మృతుడు సోమశేఖర్ 2004 బ్యాచ్‌లో ఉద్యోగంలో చేరాడు. హైదరాబాద్ నుంచి గత కొద్ది సంవత్సరాల క్రితమే విజయవాడకు బదిలీపై వచ్చారు. అందరితో సన్నిహితంగా ఉండేవాడని సహ ఉద్యోగులు విలపిస్తూ తెలిపారు. సోమశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement