Shraddha Kapoor Rohan Shrestha Breakup - Sakshi
Sakshi News home page

Shraddha Kapoor : బ్రేకప్‌ రూమర్స్‌పై తొలి సారిగా స్పందించిన శ్రద్దా కపూర్‌

Published Fri, Mar 25 2022 3:43 PM | Last Updated on Sat, Mar 26 2022 8:21 AM

Shraddha Kapoor Reacts On Breakup Rumours With Rohan Shrestha - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ బ్రేకప్‌ ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లుగా ఫోటోగ్రాఫర్‌ రోహన్ శ్రేష్ఠ‌తో ప్రేమలో మునిగి తేలుతున్న శ్రద్దా ఊహించని విధంగా బ్రేకప్‌ చెప్పేయడం ఆమె అభిమానులకు షాకింగ్‌గా అనిపింస్తుంది. బాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనిపై ఇంతవరకు వీరిద్దరు స్పందించకపోయినా వీరి బ్రేకప్‌ నిజమేనని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.చదవండి: ప్రియుడితో స్టార్‌ హీరోయిన్‌ బ్రేకప్‌!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు 

గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఊహించని విధంగా బ్రేకప్‌తో తమ లవ్‌స్టోరికి ఎండ్‌కార్డ్‌ వేసేశారు. గోవాలో జరిగిన శ్రద్దా కపూర్‌ బర్త్‌డే పార్టీ ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చింది. కాగా సోషల్‌ మీడియాలో శ్రద్దా బ్రేకప్‌పై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. ఔర్‌ సునావో( ఇంకా వినిపించండి)అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. సాహో చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులకి దగ్గరైన శ్రద్దా రణబీర్ కపూర్ సరసన  ఓ సినిమా  చేస్తుంది. వీటితో పాటు`చాల్ బాజ్`..`నాగిన్` లాంటి సినిమాలు చేతిలో ఉన్నాయి. చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్‌ వాడిన బైక్‌ కోసం అంత ఖర్చయిందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement