ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (పాత ఫొటో)
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో వినూత్న ప్రయత్నం మొదలైంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(యూపీసీసీ) గురువారం ఇందుకు శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పని చేయాలనుకునే ఆశావాహులకు పరీక్షను నిర్వహించింది. పార్టీలో ప్రొఫెషనలిజం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్‌కు శుభపరిణామనే చెప్పాలి.
‘యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొనండి. ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, మన్మోహన్ సింగ్ విజయాలను రాయండి’వంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పరీక్షా ప్రశ్నాపత్రంలో కనిపించాయి. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 70 మంది నాయకులు(ప్రస్తుతం అధికార ప్రతినిధులు పని చేస్తున్నవారు కూడా) పరీక్షకు హాజరయ్యారు.
30 నిమిషాల్లో 14 ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు. అయితే, ఇందుకు ఇంటర్నెట్ వినియోగాన్ని అనుమతించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధులు ప్రియాంక చతుర్వేది, రోహన్ గుప్తాలు ఇంటర్వూలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment