ఏపీకి పూర్తి మద్దతు ఉంటుంది : శరద్‌ యాదవ్‌ | Sharad Yadav Express Solidarity To YSRCP MP Hunger Strike | Sakshi
Sakshi News home page

ఏపీకి పూర్తి మద్దతు ఉంటుంది : శరద్‌ యాదవ్‌

Published Mon, Apr 9 2018 9:28 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

Sharad Yadav Express Solidarity To YSRCP MP Hunger Strike - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్‌ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ దేశ రాజధానిలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా ప్రజలు హక్కునే అడుగుతున్నారు కానీ, కొత్త కోరికలు కోరడం లేదని ఆయన అన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న చట్టం ప్రకారం ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. కానీ కాంగ్రెస్‌ను బూచీగా చూపెడుతూ బీజేపీ మాటలు దాటేస్తుందని శరద్‌యాదవ్ విమర్శించారు. ఏపీకీ జరిగిన అన్యాయం గురించి విజయసాయిరెడ్డి వివరించారని అన్నారు. ఈ విషయంలో తమ పూర్తి మద్దతు వైఎస్సార్‌ సీపీకి ఉంటుందని శరద్‌ యాదవ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement