Solidarity
-
కేన్స్‌లో హైలెట్‌గా నటి పుచ్చకాయ హ్యాండ్‌బ్యాగ్.. వెనుక ఇంత కథా..!
ఇటీవల ప్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో అగ్ర సినీ తారలంతా తమదైన ఫ్యాషన్ స్టైల్లో మెరిశారు. ఒక్కోకరూ ఒక్కో పంథాలో తమ డిజైనర్ వేర్ డ్రస్సింగ్ స్టయిల్‌తో మెరిశారు. మరికొందరూ మాత్రం తమ ఫ్యాషన్‌కి అద్భుతమైన జోడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సరిగ్గా అలాంటి పనే చేశారు మలయాళ నటి కని కుస్రుతి. ఆమె ధరించిన పర్సు వెనుక ఉన్న స్టోరీ వింటే..వావ్..! అని మెచ్చుకోకుండా ఉండలేరు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించిన "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన డిజైన్ వేర్ దుస్తులతో మెరిశారు. అయితే ఈ వేడుకలో ఆమె చేతికి ఉన్న పుచ్చకాయను పోలిన హ్యాండ్‌బ్యాగ్ కాస్త హైలెట్‌గా నిలిచింది. ఈ వేడుకలో ఆమె స్టయిలిష్‌గా ఈ పుచ్చకాయను ధరించడానికి గల రీజన్ వింటే కంగుతింటారు. తన ఫ్యాషన్‌తో ఈ కేన్స్ రెడ్‌కార్పెట్‌పై భారత్ తరుఫునా పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు కని. అందుకోసమే ఆమె ఈ పుచ్చకాయ హ్యండ్ బ్యాగ్‌ను ఎంచుకున్నారట. అందేంటి దీంతో సంఘీభావమా? అనుకోకండి. ఎందుకంటే ఈ పుచ్చకాయ పాలస్తీనా జెండా రంగులను పోలీ ఉంటుంది. ఎర్ర పుచ్చకాయలోని గజ్జు, నల్లగింజలు, లోపలి తెల్లని తొక్క భాగం పైన ఉండే ఆకుపచ్చని భాగం ఇవన్నీ పాలస్తీనా జెండాకు చిహ్నంగా ఉంటాయి. అందుకే దీన్ని ఎంచుకున్నారు కని. నిజానికి ఇలా పాలస్తీనా చిహ్నంగా పుచ్చకాయ చిహ్నంగా ఉద్భవించింది 1967లో. ఇజ్రాయెల్ గాజా వెస్ట్ బ్యాంక్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని తూర్పు జెరూసలెంని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత గాజాలో పాలస్తీనా జెండాను ప్రదర్శించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ఉత్తర్వుని జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్లు పుచ్చకాయను తమ జెండాకు చిహ్నంగా ఉపయోగించారు.ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ దాడులతో భయంకరంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 35 వేల మందికి పైగా చనిపోయారు. వారిలో సుమారు 15 వేలకు పైగా చిన్నారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఇలా కని తోపాటు కేన్స్‌లో పాలస్తీనాకు సంఘీ భావం తెలిపిన ఇతర అంతర్జాతీయ నటులు, కేట్ బ్లాంచెట్, లీలా బెఖ్తీ వంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ నటి కేట్ బ్లాంచెట్ పాలస్తీనా జెండాను అనుకరించేలా గౌను ధరించగా, బెఖ్తీ పుచ్చకాయ విత్తనాన్ని పోలిన హృదయం ఆకారపు పిన్ను ధరించారు. (చదవండి: ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?) -
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’. -
ఉక్రెయిన్‌కు అంత సత్తా ఎక్కడిది?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనని అందరూ అనుకున్నారు. ఏదో నాలుగైదు రోజుల్లో ఉక్రెయిన్‌ని రష్యా స్వాధీనం చేసుకుంటుందని అంచనాలు కట్టారు. కానీ అందరి లెక్కలు తప్పాయి. రెండు వారాలైనా ఉక్రెయిన్ దండు రష్యా దండయాత్రని సమర్థంగా అడ్డుకుంటోంది. నాటో తన బలగాలు దింపకపోయినా, నో–ఫ్లై జోన్‌ని ప్రకటించడానికి నిరాకరించినా ఉక్రెయిన్ పోరాటాన్ని ఆపలేదు. చావో రేవోకి సిద్ధమై యుద్ధం చేస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్ ఈ స్థాయి పోరాటపటిమను ఎలా చూపిస్తోంది? ఉక్రెయిన్‌కి కలిసొచ్చే అంశాలేమిటి? రష్యా చేసిన తప్పిదాలేంటి? సన్నద్ధత పశ్చిమ దేశాల సహకారంతో ఉక్రెయిన్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంది. రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న దగ్గర్నుంచి ఉక్రెయిన్ ఆత్మ రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి నాటో సైనికులతో శిక్షణనిచ్చింది. ‘ఏ క్షణంలో రష్యా దాడికి దిగినా ఎదుర్కోవడానికి 8ఏళ్లుగా ఉక్రెయిన్ ప్రణాళికలు రచిస్తోంది. ఆయుధాల పెంపు, బలగాలకు శిక్షణ, వ్యూహరచన వంటి అంశాల్లో బలంగా నిలిచింది’అని జార్జ్‌టౌన్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డౌగ్లస్ చెప్పారు. స్థానబలం స్థానబలానికి మించిన బలం ఏదీ లేదంటారు. సరిగ్గా ఇక్కడే రష్యా ఉక్రెయిన్‌ని తక్కువ అంచనా వేసింది. సోవియెట్ యూనియన్‌గా ఉన్న రోజుల్లో ఉక్రెయిన్ భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేసుకుందే తప్ప, ఇన్నేళ్లలో ఆ ప్రాంతం ఎంత మారిపోయిందో, స్థానికంగా ఉక్రెయిన్ బలగాల ప్రాబల్యం ఎలా పెరిగిందో తెలుసుకోలేకపోయింది. ప్రజలే ఆయుధాలు చేతపట్టి తిరుగుబాటు చేస్తారని గ్రహించుకోలేక ఇప్పుడు కదన రంగంలో గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారిపోవడంతో ఉక్రెయిన్ బలగాలు ఎటు నుంచి వచ్చి మీద పడతాయో తెలుసుకోలేక రాజధాని కీవ్‌ను పదిహేను రోజులైనా స్వాధీనం చేసుకోలేకపోతోంది. ‘ఉక్రెయిన్‌లో మార్పుల్ని అంచనా వేయడంలో రష్యా విఫలమైంది. వీధి వీధిలోనూ, ప్రతీ భవంతిలోనూ అన్నిచోట్లా రష్యా బలగాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’అని కాలేజీ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ ప్రొఫెసర్ స్పెన్సర్ మెరెదిత్ చెప్పారు. సంఘీభావం పౌర నివాసాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్ని లక్ష్యం గా చేసుకొని రష్యా బలగాలు దాడి చేస్తూ ఉండడంతో ఉక్రెయిన్ ప్రజలతో ప్రపంచదేశాల్లో రష్యా పై ఒక కసి పెరిగింది. ప్రాణాల మీదకొస్తున్నా అధ్యక్షుడు జెలెన్స్కీ లెక్కచేయకుండా కీవ్‌లో ఉంటూ అందరిలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించారు. దీంతో ప్రజలంతా స్వచ్ఛందంగా ఆయుధాలు చేతపూని ఎదురుదాడికి దిగారు. రష్యా భీకరమైన దాడులకు ఎదురుదాడికి దిగడం తప్ప ఉక్రెయిన్‌కు మరో మార్గం లేదని రిటైర్డ్ ఫ్రెంచ్ కల్పనర్ మైఖేల్ గోయా అభిప్రాయపడ్డారు. ఆయుధాలే ఆయుధాలు రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత నాటో బలగాలు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ఆయుధాలను లెక్కకు మించి సరఫరా చేస్తున్నాయి. నాటోలో సభ్యత్వం లేకపోయినప్పటికీ స్వీడన్, ఫిన్లాండ్ సహా 20కిపైగా దేశాలు వేల సంఖ్యలో యుద్ధట్యాంక్ విధ్వంసక ఆయుధాలను పంపించాయి. దాడి మొదలయ్యాక రోజుకో కొత్త రకం ఆయుధాలు ఉక్రెయిన్‌కు అందుతున్నాయి. 2,000కు పైగా స్ట్రింగర్ మిస్పైల్ (మ్యానన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్), 17 వేలకు పైగా యుద్ధ ట్యాంక్ విధ్వంసక తేలికపాటి ఆయుధాలు, 2,000 యుద్ధట్యాంక్ విధ్వంసక క్షిపణులను పశ్చిమ దేశాలు సరఫరా చేశాయి. గ్రనేడ్లు, రాకెట్లు, ఇతర ఆయుధాలు భారీ సంఖ్య లో ఉన్నాయి. ఉక్రెయిన్‌లో ప్రతీ ఒక్కరి చేతిలో ఆయుధం ఉందంటే అతిశయోక్తి కాదేమో. రష్యా తప్పిదాలు ఉక్రెయిన్‌ని కొట్టడం ఏమంత పెద్ద పని కాదని రష్యా తేలిగ్గా తీసుకుంది. ఎక్కువగా బలగాలను మోహరించలేదు. మూడు రోజుల్లో రాజధాని కీవ్ వశమైపోతుందని భావించడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికాలోని రష్యా స్టడీస్ ప్రోగ్రామ్ ఎట్ ది సెంటర్ ఫర్ నేవల్ అనాలిసస్ డైరెక్టర్ మైఖేల్ కోఫ్మన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్ని బలగాలను మోహరించినప్పటికీ ఈలోగా ఉక్రెయిన్ చేతుల్లోకి ఆయుధాలు వచ్చి చేరాయి. నైతిక స్థైర్యం రష్యా సైన్యానికి ఊహించని నష్టం జరగడంతో సైనికులు నైతిక స్థైర్యం తగ్గిపోయింది. యుద్ధభూమిలో వేల సంఖ్యలో మరణాలు, క్షతగాత్రులతో పాటు చాలామందికి తాము యుద్ధానికి వెళుతున్నామన్న విషయం తెలీదు. పుతిన్ ప్రభుత్వం సైనికులకు అసలు విషయం చెప్పకుండా దాచి కదనరంగానికి పంపడం తప్పిదేమనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
రైతుల కోసం రిహన్నా.. ఫూల్ అన్న కంగనా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవం నాడు ఉద్యమం ఉద్రిక్తతంగా మారి హింస చేలరేగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతునిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా చేరారు. ట్విట్టర్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న రిహన్నా.. అన్నదాతలు చేస్తోన్న ఉద్యమంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్లో రైతుల ఉద్యమానికి సంబంధించని ఓ న్యూస్ ఆర్టికల్ క్లిప్‌ని షేర్ చేస్తూ.. మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు రిహన్నా. ఇక ఈ పేపర్ క్లిప్ సీఎన్‌ఎన్‌ది కాగా.. దీనిలో గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు రైతు ఉద్యమం ఉద్రిక్తంగా మారడం.. హింస చేలరేగడంతో ఢిల్లీ చుట్టుపక్కల ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని తెలిపే కథనానికి సంబంధించింది. అలానే మయన్మార్‌లో ఆర్మీ దురగతాలను కూడా ప్రశ్నించారు రిహన్నా. (చదవండి: 6న దేశవ్యాప్త చక్కా జామ్) why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S — Rihanna (@rihanna) February 2, 2021 ఇక రిహన్నా ట్వీట్‌కు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రిప్లై ఇచ్చారు. ‘‘దీని గురించి ఎవరు మాట్లాడటంలేదు ఎందుకంటే వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు. వీరు దేశాన్ని విభజిస్తే.. చైనా దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా లాంటి ఓ కాలనీని తయారు చేయాలని ఎదురు చూస్తోంది. నోర్మూసుకుని కూర్చో ఫూల్.. మీలాంటి డమ్మీలకు మా దేశాన్ని అమ్మం’’ అంటూ కంగనా ఘాటుగా రిప్లై ఇచ్చారు. No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA... Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a — Kangana Ranaut (@KanganaTeam) February 2, 2021 ఇక రైతుల ఉద్యమానికి యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ మద్దతు తెలిపారు. భారతదేశంలోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నాము అంటూ ట్వీట్ చేశారు. ఇక అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ కూడా రైతులకు మద్దతు తెలిపారు. -
దీప యజ్ఞం సక్సెస్
న్యూఢిల్లీ: దీప కాంతిలో భారతావని వెలుగులీనింది. కరోనా రక్కసి అంతానికి దేశ ప్రజలంతా ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌పై అలుపెరగని పోరుకు సంఘీభావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘దీప యజ్ఞం’ విజయవంతమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు వెలిగించి కరోనా రాక్షసిని అంతమొందించే ఉమ్మడి సంకల్పానికి ఘనంగా సంఘీభావం తెలిపారు. కోట్లాది భారతీయులు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి 9 నిమిషాల పాటు తమ ఇళ్ల ముందు, బాల్కనీల్లో దీపాల వెలుగులను విరజిమ్మి, మహమ్మారిపై పోరులో విజయమే లక్ష్యమని ప్రతిన బూనారు. ప్రధాని మోదీ కూడా తన ఇంటిముందు దీప స్థంభాన్ని వెలిగించి, కరోనాపై కదనంలో ముందుంటానని దేశ ప్రజలకు ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ దీప యజ్ఞంలో మమేకమయ్యారు. తమ నివాసాల్లో దీపాలను వెలిగించి, ప్రధాని మోదీ సంకల్పానికి సంఘీభావం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాణాసంచా కాల్చడం, హిందూ ప్రార్థనా గీతాలను, మంత్రాలను వినిపించడం కూడా కనిపించింది. మరికొన్ని చోట్ల జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు, తమ ఇళ్లల్లోని విద్యుద్దీపాలను ఆర్పేసి, ఇంటి ముందు దీపాలు, కొవ్వొత్తులు, లేదా మొబైల్ టార్చ్‌లు వెలిగించి కరోనాను తరిమికొట్టే తమ ఉమ్మడి సంకల్పాన్ని ఘనంగా ప్రకటించాలని శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ సేఫ్ దేశవ్యాప్తంగా ఇళ్లల్లో విద్యుద్దీపాలను ఒకేసారి 9 నిమిషాల పాటు ఆర్పేసే కార్యక్రమం జరిగినప్పటికీ.. విద్యుత్ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. డిమాండ్‌లో ఒకేసారి భారీగా తగ్గుదల, 9 నిమిషాల అనంతరం ఒకేసారి అదే స్థాయిలో పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ.. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సిద్ధమై, అవసరమైన చర్యలు తీసుకుందన్నారు. ‘గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. నేను, మా శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించాం. సమర్ధవంతంగా ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఎన్ఎల్డీసీ, ఆర్ఎల్డీసీ, ఎస్‌ఎల్‌డీసీల్లోని ఇంజినీర్లందరికి అభినందనలు’ అని సింగ్ పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా 117 గిగావాట్ల నుంచి 85.3 గిగావాట్లకు తగ్గిపోయింది. అంటే 30 గిగావాట్లకు పైగా డిమాండ్ తగ్గింది. ఇది మేం తగ్గుతుందని ఊహించిన 12 గిగావాట్ల కన్నా చాలా ఎక్కువ’ అని ఆయన వివరించారు. దీప యజ్ఞం సందర్భంగా ఒకేసారి విద్యుత్ వినియోగం తగ్గితే గ్రిడ్ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. సరుకుల రవాణాకు సహకరించండి నిత్యావసరాల రవాణాలో కీలకమైన ట్రక్ డ్రైవర్లు, ఇతర కూలీలు తమ పని ప్రదేశాలకు వెళ్లేందుకు సహకరించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అప్పుడే నిత్యావసరాల సరఫరా సజావుగా సాగుతుందని పేర్కొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జాన్సన్ జయకేతనం
లండన్/బ్రస్సెల్స్: పదేపదే వస్తున్న ఎన్నికలతో విసిగిన బ్రిటిష్ ఓటర్లు ఈసారి నిర్ణాయక తీర్పునిచ్చారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు. ఈ చారిత్రక విజయంతో వచ్చే జనవరి ఆఖరులోగా యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి వైదొలిగేందుకు అవకాశం లభించిందని బోరిస్ జాన్సన్(55) తెలిపారు. ‘బ్రెగ్జిట్ పూర్తి చేసుకుందాం’ అనే ఏకైక నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జాన్సన్..1980వ దశకంలో ప్రధాని మార్గరెట్ థాచర్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేశారు. జెరెమి కార్బిన్ నేతృత్వంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కేవలం 203 సీట్లను సాధించింది. అక్టోబర్ 31వ తేదీలోగా బ్రెగ్జిట్ అమలే లక్ష్యంగా జూలైలో థెరిసా మే నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్, పార్లమెంట్లో మెజారిటీ లేకపోవడంతో అనుకున్నది సాధించలేక ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే, గత అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు రావడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దాదాపు వందేళ్ల తర్వాత శీతాకాలంలో గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో 67 శాతం మంది ఓట్లేశారు. పార్లమెంట్(కామన్స్ సభ)లోని 650 సీట్లకు గాను కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాలను సాధించింది. విజయోత్సవ ర్యాలీలో బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్‌కు ఇది మరో శుభోదయం. గడువులోగా బ్రెగ్జిట్ సాధిస్తాం. ప్రతిష్టంభనను తొలగిస్తాం. ఓటర్ల నమ్మకాన్ని వమ్ముచేయను’ అని ప్రకటించారు. బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ విజయంపై ఈయూ వెంటనే స్పందించింది. బ్రిటన్‌తో బ్రెగ్జిట్‌పై తదుపరి చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. -
డాక్టర్ల సమ్మెకు దేశవ్యాప్తంగా మద్దతు
న్యూఢిలీ : పశ్చిమ బెంగాల్‌లోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని వైద్యులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం పిలుపు మేరకు డాక్టర్లు ఈ సమ్మె చేపట్టారు. ఢిల్లీ సహా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లో వైద్యులు ఒక్క రోజు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిమ్స్‌లో వైద్యులు నిరసనకు దిగగా.. ఢిల్లీ మెడికల్ అసోసిషేయన్ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజు పాటు అన్ని వైద్య సేవలను నిలిపి వేయాలని పిలుపునిచ్చింది. దేశ రాజధానిలో పలువురు రెసిడెంట్ వైద్యులు జంతర్ మంతర్ వద్దకు చేరి నిరసన చేపట్టారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో జూనియర్ వైద్యుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. వైద్యుల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
శ్రీలంకలో 13.8 కోట్ల మంది చనిపోయారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో చోటుచేసుకున్న మారణకాండలో ఏకంగా 138 మిలియన్ల మంది(13.80 కోట్లు) చనిపోయారని, 600కుపైగా జనం గాయపడ్డారని ట్వీట్ చేశారు. అమెరికా ప్రజల తరపున శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నానన్నారు. మృతులకు సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో లంక పౌరులకు అండగా నిలిచేందుకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీలంకలో 13.80 కోట్ల మంది మృతి చెందారంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుపట్టారు. అన్నింటినీ మిలియన్లలో లెక్కించలేమని, సానుభూతి సందేశంపై కూడా శ్రద్ధ చూపకపోతే అది నిజమైన సానుభూతి ఎలా అవుతుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘‘మా దేశ జనాభా 2.17 కోట్లే, అలాంటప్పుడు 13.80 కోట్ల మంది మరణించడం అసాధ్యం, మీ సానుభూతి మాకేం అక్కర్లేదు’’అని శ్రీలంకకు చెందిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తిప్పికొట్టారు. ట్రంప్ లెక్క ప్రకారం ఇప్పుడు మా దేశం ప్రజలెవరూ లేకుండా ఖాళీగా మారింది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ పలుమార్లు తప్పుడు ట్వీట్లు చేసి నవ్వుల పాలయ్యారు. -
ఏపీకి పూర్తి మద్దతు ఉంటుంది : శరద్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ దేశ రాజధానిలో వైఎస్సార్ సీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా ప్రజలు హక్కునే అడుగుతున్నారు కానీ, కొత్త కోరికలు కోరడం లేదని ఆయన అన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న చట్టం ప్రకారం ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. కానీ కాంగ్రెస్‌ను బూచీగా చూపెడుతూ బీజేపీ మాటలు దాటేస్తుందని శరద్‌యాదవ్ విమర్శించారు. ఏపీకీ జరిగిన అన్యాయం గురించి విజయసాయిరెడ్డి వివరించారని అన్నారు. ఈ విషయంలో తమ పూర్తి మద్దతు వైఎస్సార్ సీపీకి ఉంటుందని శరద్ యాదవ్ తెలిపారు. -
దీక్షలో టీడీపీ ఎంపీలూ భాగం కావాలి..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. హోదాకు మద్దతుగా రాజీనామాకు, ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు ఆదివారం సాయంత్రం విజవాడలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీల రాజీనామాల విషయమై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును చంద్రబాబు ఎందుకు స్వాగతించడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీలో చేపట్టబోమే ఆమరణ నిరాహార దీక్షలో భాగం కావాలని టీడీపీ ఎంపీలకు హితవు పలికారు. -
ఫైర్‌బ్రాండ్‌కు ‘రెబల్’ మద్దతు
న్యూఢిల్లీ: బీజేపీ ‘రెబల్’ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శస్త్రాలు ఎక్కుపెట్టారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి బాసటగా నిలిచారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా నవ్వినందుకు బీజేపీ నాయకులు ఆమెను రామాయణంలోని తాటాకితో పోల్చి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శత్రుఘ్నసిన్హా ట్విటర్లో స్పందించారు. రేణుక ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎవరేమన్నా పట్టించుకోవద్దని, తనను చూసి ఏడ్చేవారిని ఏడవనివ్వాలని సూచించారు. మహిళా సాధికారతను వ్యతిరేకించేవాళ్లు త్వరలోనే పతనమవుతారని వ్యాఖ్యానించారు. వారికి ఇదే చివరి నవ్వు అవుతుందని పేర్కొంటూ నారీ శక్తికి జై కొట్టారు. బీజేపీకి తలనొప్పిలా తయారైన శత్రుఘ్నసిన్హా ఇంతకుముందు కూడా ప్రతిపక్ష నాయకులను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు. బీజేపీ అగ్రనాయకులపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నాయకులను వెనకేసుకొచ్చారు. Laugh Renuka laugh! We love you, we're fond of you & wish you well. Don’t worry, be happy! Let them cry & shout hoarse. Things will settle down. Those who oppose women's empowerment & laughter would melt soon. We all will have the last laugh. Long live ‘Nari Shakti. Jai hind! — Shatrughan Sinha (@ShatruganSinha) February 13, 2018 -
పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదుల సంఘీభావం
-
‘సైగల’తో సంఘీభావం
బధిరుడైన క్లాస్‌మేట్‌కు సంఘీభావం తెలపాలనుకున్నారు ఆ పిల్లలు. దీనికోసం వాళ్లు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కొద్ది నెలల్లోనే పట్టుదలతో సైగల భాష నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లందరూ బధిరుడైన తమ క్లాస్‌మేట్‌తో ఇంచక్కా సైగల భాషతో రోజూ తెగ కబుర్లాడేసుకుంటున్నారు. బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా రాజధాని సారాజెవోలోని నకాస్ ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరేళ్ల జెజ్ద్ ఒకటో తరగతిలో చేరాడు. అతడు పుట్టుకతోనే బధిరుడు. అలాగని ఆ పాఠశాల మూగ బధిరుల కోసం ప్రత్యేకించినదేమీ కాదు. మామూలు విద్యార్థులు చదువుకునే పాఠశాలే. దగ్గర్లో మరే పాఠశాల లేకపోవడంతో జెజ్ద్ను అతడి తల్లి ఆ పాఠశాలలో చేర్చడానికి తీసుకొచ్చింది. టీచర్లకు అతడి పరిస్థితిని వివరించింది. వారు కూడా సానుకూలంగా స్పందించి, అతడిని చేర్చుకున్నారు. కొత్తగా వచ్చిన జెజ్ద్తో స్నేహంగా ఉండాలంటూ మిగిలిన పిల్లలకు చెప్పారు. మిగిలిన పిల్లలు కూడా అతడితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ల మాటలేవీ అతడికి వినిపించకపోవడంతో మొదట్లో కాస్త నిరుత్సాహం చెందారు. అతడి సైగల భాష వాళ్లకు అర్థం కాకపోవడంతో కొన్నాళ్లు వాళ్లు అయోమయం చెందేవాళ్లు. పిల్లల ఇబ్బందిని గమనించిన వాళ్ల టీచర్ సనేలాకు ఒక ఐడియా వచ్చింది. జెజ్ద్కు ఎలాగూ మాటలు వినిపించవు కదా, అందుకే తాను సైగల భాష నేర్చుకోవడానికి సిద్ధపడింది. మిగిలిన పిల్లలను కూడా సైగల భాష నేర్చుకునేలా ప్రోత్సహించింది. కొద్ది నెలల్లోనే వాళ్లు సైగల భాషను నేర్చేసుకున్నారు. తన కోసం తన క్లాస్మేట్స్ అందరూ సైగల భాష నేర్చుకోవడంతో జెజ్ద్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక అప్పటి నుంచి క్లాస్‌లో సందడే సందడి. -
రోహిత్‌ది సంస్థాగత హత్య
పుణె: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఉద్రిక్తతను రాజేసిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై పుణె విద్యార్థులు స్పందించారు. ఎనిమిదిమంది విద్యార్థులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఇది సంస్థాగత హత్య అని విద్యార్థి సంఘం అధ్యక్షుడు హరిశంకర్ ఆరోపించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. యూనివర్శిటీల్లో విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమించాలని ఆయన కోరారు. రోహిత్ అకాల మరణానికి నిరసనగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మంచి స్పందన లభించింది. మొదట ఎనిమిది మందితో మొదలైన ఆందోళనకు మరింత మంది విద్యార్థులు తోడయ్యారు. విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా ఆందోళనచేస్తున్న ఉద్యమకారులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపిన విద్యార్థి నేతలు కులమత వివక్షలకు తావులేకుండా నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల్లో విద్వేషాలను రెచ్చగొడ్డుతున్న భావజాలానికి వ్యతిరేకంగా అందరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గత సంవత్సరం ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా టీవీనటుడు, బీజేపీ సభ్యుడు గజేంద్ర చౌహాన్ నియామకం నిరసనగా 139 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పలు నమోదు కేసులు నమోదయ్యాయి. -
అర్చకుల సమస్యలు అసెంబ్లీలో చర్చిస్తా- ఎర్రబెల్లి
పాలకుర్తి టౌన్ (వరంగల్ జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీటీడీపీ శాసనసభాపక్ష నాయకులు ఎమ్మెల్యే ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహదేవాలయం ఆవరణలో అర్చకుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. 010 పద్దు కింద అర్చక ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలనే న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. డిమాండ్లు సాధించుకునే వరకు ఆందోళన విరమించొద్దని ఆయన అర్చకులను కోరారు. ఈ కార్యక్రమంలో అర్చక ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ డివీఆర్ శర్మ తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు గంగు కృష్ణమూర్తి,మండల పార్టీ అద్యక్షులు నల్ల నాగిరెడ్డి, సర్పంచ్ అంగడి అంజమ్మ, ఎంపీటిసి ఫోరం జిల్లా కార్యదర్శి కత్తి సైదులు, సర్పంచులు మాచర్ల పుల్లయ్య, వేల్పుల లక్ష్మి దేవరాజ్, నాయకులు కడుదల కర్నాకర్ రెడ్డి, కారుపోతుల కుమార్, పాలెపు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
భారత పార్లమెంటు నివాళి
పెషావర్ మృతులకు సంతాపం తెలిపిన ఎంపీలు ఘటనను ఖండిస్తూ తీర్మానం; బాధితులకు సంతాపం న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని పెషావర్ మారణకాండలో చనిపోయిన చిన్నారులకు పార్లమెంటు బుధవారం నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించింది. సిడ్నీ, పెషావర్ వంటి ఘటనలు ప్రపంచ దేశాలన్నింటికీ హెచ్చరికలాంటివని... మానవత్వంపై నమ్మకమున్నవారందరూ ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి చేతులు కలపాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు పెషావర్‌లో ఉగ్రవాద ఘాతుకానికి బలైన చిన్నారులకు నివాళిగా లోక్‌సభ, రాజ్యసభల్లో సభ్యులంతా కొంతసేపు నిలబడి మౌనం పాటించారు. తొలుత పెషావర్ ఘటనలో బాధిత కుటుంబాలు, పాకిస్తాన్ ప్రజలకు సంతాపం వ్యక్తం చేస్తూ.. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఉగ్రవాదం పట్ల ఏ మాత్రం కూడా సహనం చూపకుండా, కఠినంగా వ్యవహరించాలని తీర్మానంలో పేర్కొంది. ఇక రాజ్యసభలోనూ సభ్యులంతా కొంత సేపు మౌనం పాటించారు. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి, చైర్మన్ హమీద్ అన్సారీ పేర్కొన్నారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రసంగిస్తూ... సిడ్నీ, పెషావర్ ఘటనలను ఖండించారు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి అందరూ ఉమ్మడిగా కృషి చేయాలని... ఇందుకోసం భారత్ సంసిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పాఠశాలలో చొరబడి అత్యంత పాశవికంగా 132 మంది చిన్నారులను బలిగొన్న ఈ ఘటనను మొత్తం ప్రపంచం ఖండిస్తోందన్నారు. సరిహద్దులు, విభేదాలకు అతీతంగా భారత్ ఆ ఘటనపై స్పందించిందని, సానుభూతిని ప్రకటించిందని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మాట్లాడి మన దేశ ప్రజల తరఫున సంఘీభావం తెలిపారని సుష్మా చెప్పారు. రెండు రోజుల కింద సిడ్నీలో జరిగి ఉగ్రవాద ఘాతుకాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఉగ్రవాదం ప్రపంచం మొత్తానికీ ముప్పుగా పరిణమించిందని వ్యాఖ్యానించారు. స్కూళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయండి పాక్ సైనిక స్కూల్లో ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విద్యాసంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. అలాగే షాపింగ్ మాల్స్ వద్ద కూడా భద్రతను పెంచాలని పేర్కొంది. బుధవారం పార్లమెంట్ బయట కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఉగ్రవాద దాడి జరిగితే ఏం చేయాలి? పిల్లల్ని ఎలా అప్రమత్తం చేయాలి? అన్న విషయాలపై స్కూళ్లకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చే నెల భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ కేంద్రం బుధవారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశమున్న ప్రదేశాలు, కట్టడాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. -
సమైఖ్య శంఖారావంకు లండన్ నుంచి సంఘీభావం
లండన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లో ఎల్బి స్టేడియంలో ఈ నెల 26న నిర్వహించే సమైఖ్య శంఖారావం బహిరంగ సభకు ఆ పార్టీ యుకే - యూరప్ విభాగం సంఘీభావం తెలిపింది. 'సమైఖ్య శంఖారావం' బహిరంగ సభకు పూర్తి మద్దతు తెలుపుతూ లండన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా వంగల సందీప్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, పరిపాలనా అనిశ్చితికి టీడీపి-కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలే కారణం అన్నారు. వారు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి కుటిల రాజకీయాలు చేస్తున్నందున ప్రజలు జగన్ పక్షాన వున్నారన్నారు. సమైఖ్య శంఖారావం సభ ఎవరికీ వ్యతిరేఖంగా నిర్వహిస్తున్న సభ కాదని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరిని ఎండగట్టడంతో పాటు మెజారిటీ ప్రజల అభిష్టాలకు విరుద్దంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండుతో సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. అందువల్ల మనమందరం మన వంతు కృషి చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. 'రాజన్న రాజ్యం' ఆవశ్యఖతను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపు ఇచారు. నాగేందర్ మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయతే జగన్ అన్న డిఎన్ఏ అన్నారు. రాజన్న అలాంటి పరిపాలనా దక్షత జగనన్నకే సాధ్యం అని చెప్పారు. వైఎస్ అవినాష్ రెడ్డి, మేడపాటి వెంకట్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా తమసందేశాన్ని అందించారు. ఈ సమావేశంలో నవీన్ రెడ్డి, సురేష్ రెడ్డి ముదిరెడ్డి, సురేష్ తుమ్మల, నిత్యానంద రెడ్డి మాట్లాడారు. సమావేశ ప్రాంగణం అంతా జై జగన్, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అన్న నినాదాలతో దద్దరిల్లింది. -
అడుగడుగునా అడ్డగింత
సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. సంఘీభావం పేరుతో దీక్షా శిబిరాల వద్దకు వచ్చిన నేతలను ఉద్యమకారులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాజకీయాలు చేయొద్దు..రాజీనామాలు చేసి రండి అంటూ ఘెరావ్ చేశారు. కొద్దిమంది నాయకులు చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరగగా.. మరికొందరు మాత్రం ఉద్యోగులను మీరూ రాజీనామా చేయండి మేం చేస్తామంటూ ప్రగల్బాలు పలికారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన ఆందోళనకారులు వారిని అక్కడి నుంచి తరిమికొట్టేంత పనిచేశారు. లగడపాటితో లడాయి.. సమైక్యాంధ్ర పేరుతో చీటికిమాటికీ మీడియా సమావేశాలు పెడుతూ తానే మొదటి సమైక్య చాంపియన్ అని గొప్పలు చెప్పుకునే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఉద్యమకారుల నుంచి లడాయి తప్పలేదు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలిపేందుకు శనివారం యూనివర్సిటీకి వచ్చిన ఆయన్ను సమైక్యాంధ్ర విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నాయకులు యూనివర్సిటీ గేట్ వద్దే అడ్డుకున్నారు. లగడపాటి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన విద్యార్థులకు ఎంతగా నచ్చజెప్పాలని చూసినా వారు విన్పించుకోలేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మీకు ముందే తెలుసుకదా.. ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరాహారదీక్షా శిబిరం వద్దా అదే పరిస్థితి ఎదురైంది. లగడపాటి వెళ్లిపోవాలని కొందరు విద్యార్థులు దీక్షా శిబిరం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక చేసేది లేక ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. తాము మనసు చంపుకుని ఆ పార్టీలో ఉంటున్నామంటూ చెప్పుకొచ్చారు. ఉద్యమకారుల ‘విశ్వరూప’ం తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లిలో రిలేదీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రాష్ర్టమంత్రి పినిపే విశ్వరూప్‌ను సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనుయాయులకు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది. పి.గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవిని మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఘెరావ్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటారు’ అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ చేసి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యేను రెండుసార్లు అడ్డుకున్న జేఏసీ ప్రతినిధులు ‘ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే రాజీనామా’ చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జీవీఎంసీ నుంచి సౌత్జైలు రోడ్డు వద్దకు చేరుకున్న ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సమైక్య ర్యాలీకి అదే మార్గంలో వెళుతున్న రాజ్యసభ సభ్యుడు మద్దతు తెలిపేందుకు కారు దిగారు. దీంతో కొంతమంది యువకులు ఆయనను అడ్డుకున్నారు. రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, డోన్ ఎమ్మెల్యే కేఈ కష్ణమూర్తిని జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యవాదులతో జే‘ఢీ’ గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు హాజరైన కేంద్రమంత్రి జేడీ శీలంను సమైక్యవాదులు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఆయన మంత్రుల రాజీనామా కోరే అధికారులెందుకు రాజీనామా చేయడం లేదని ఎదురు ప్రశ్నించడంతో వాదులాట జరిగింది. కేబినెట్లో ఉండి సమైక్యవాదుల ప్రతినిధిగా ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పినా సంతప్తి చెందని సమైక్యవాదులు ఆయనను ఘెరావ్ చేశారు. -
జననేత కోసం జైల్‌భరో
సాక్షి నెట్వర్క్ : రాష్ట్ర విభజనలో సమన్యాయం కోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావంగా సీమాంధ్ర జిల్లాల్లో పార్టీ శ్రేణులు జైల్‌భరో కార్యక్రమం నిర్వహించాయి. విజయవాడలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు అరెస్టయ్యారు. కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ముట్టడించిన ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తదితరులు అరెస్టయ్యారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జైల్‌భరోలో వెయ్యి మందిని అరెస్టు చేశారు. విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద జైల్‌భరో చేపట్టడంతోపాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతపురంలో పార్టీ ఎమ్మెల్యేలు గుర్నాథ్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట జైల్‌భరో కార్యక్రమం చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సహా పదిమంది నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, బాపట్ల సముద్రంలో కోన రఘుపతి జలదీక్ష నిర్వహించారు. జగన్ కోసం నిడదవోలులో ముస్లిం మహిళలు ప్రార్ధనలు, భీమవరంలో వైఎస్సార్ సీపీ నేత గ్రంధి వెంకటేశ్వరరావు పూజలు నిర్వహించారు. చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. విజయనగరంలో సుజయ్‌కృష్ణ రంగారావు, పెనుమత్స సాంబశివరాజులతో పాటు వందలాది మంది కార్యకర్తలు జైల్‌భరోలో పాల్గొన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రావారిపాళెం పోలీస్ స్టేషన్ ముందు జగన్మోహన్రెడ్డి మాస్క్‌లు వేసుకుని మౌన దీక్ష చేపట్టారు. -
జనమంతా సంఘీభావం
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజనలో సమన్యాయం కోసం జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి నగరం, పట్టణం, పల్లె చేయీ చేయీ కలిపి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. నాలుగురోజుల కిందట సీమాంధ్ర జిల్లాల్లో 124 మంది చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరాలు కొనసాగుతుండగా, బుధవారం ఒక్కరోజే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 2546 మంది రిలేదీక్షలు చేపట్టారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వినూత్న నిరసనలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, కల్లూరు, డోన్ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించివ వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టాయి. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారంతో మూడురోజులు పూర్తి చేసుకుని గురువారానికి నాలుగోరోజు చేరింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో బుధవారం నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ జిల్లాలో కడప నగరం, పులివెందుల, జమ్మలమడుగు పట్టణాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్సీపీ మహిళా శ్రేణులు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశాయి. విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయానికి పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో తాళాలు వేశారు. గాంధీనగర్‌లోని పోస్టాఫీసుకు సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త గౌతంరెడ్డి నేతృత్వంలో తాళాలు వేశారు. పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేపట్టిన నిరవధిక దీక్ష ఐదోరోజుకు చేరింది. జగన్ దీక్షకు సంఘీభావంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బుధవారం బంద్‌తో పాటు హైవేని దిగ్బంధించారు. నెల్లూరు నగరంలో పార్టీ సిటీ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. వైఎస్సార్ జిల్లా దువ్వూరులో జగన్ దీక్షకు మద్దతుగా డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి హైవేను దిగ్బంధనం చేసి వంటావార్పు చేపట్టారు. విశాఖ జిల్లా ఉద్దండపురంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాజమండ్రిలో గోదావరి సమైక్యనాదం జగన్ దీక్షకు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ‘గోదావరి సమైక్యనాదం’ పేరిట 12 మరపడవలతో గోదావరిలో యాత్ర చేపట్టారు. సమైక్య రాష్ట్ర పతాకాలు, నినాదాలతో కూడిన బ్యానర్లు పట్టుకుని పార్టీ శ్రేణులు ఈ యాత్రలో పాల్గొన్నాయి. గుంటూరు జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో, నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోనూ మోటారు సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాగా, జగన్ దీక్షకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టాలని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కే.ఓబుళపతి బుధవారం అనంతపురంలో పిలుపునిచ్చారు. -
జగన్‌దీక్షకు సంఘీభావం
సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడంతో, ఆయనకు మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు మంగళవారం రహదారులు దిగ్బంధించారు. మరికొంతమంది నాయకులు దీక్షలకు దిగుతున్నారు. చిత్తూరులో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నేతృత్వంలో బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీ సులు మనోహర్‌ను అరెస్టు చేశారు. ఆయనను చిత్తూరు 2 టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి, రెండు గంటల తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో పిచ్చాటూరులో చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఆదిమూలంతో పాటు, పార్టీ నాయకుడు హరిశ్చంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలమనేరులో పట్టణ కన్వీనర్ హేమంతకుమార్ నేతృత్వంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గంగవరంలో సీవీ కుమార్ నాయకత్వంలో రహదారులపై బైఠాయించారు. మదనపల్లెలో పార్టీ మైనారిటీ నాయకుడు బాబ్జాన్ నాయకత్వంలో బెంగళూరు రోడ్డును దిగ్బంధం చేశారు. మదనపల్లెలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి షమీమ్ అస్లాం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఆమె ఆరోగ్యంపట్ల నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తంచేయడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిత్తూరులో మూడో రోజు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఆ పార్టీ నాయకులకు విద్యార్థులు, ఫ్యాక్టరీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. శ్రీకాళహస్తిలో బియ్యపు కృష్ణారెడ్డి మండపంలో పార్టీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వారికి వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు వరప్రసాదరావు సంఘీభావం తెలిపారు. గంగాధరనెల్లూరు పరిధిలోని ఎస్ఆర్పురం, పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లో జగన్‌కు సంఘీభావంగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. గంగాధర నెల్లూరులో జరిగిన దీక్షకు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి సంఘీభావం ప్రకటించారు. పుంగనూరులోను రిలే నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా, ఆ పార్టీ సమన్వయకర్త రెడ్డెప్ప, మార్కెట్ కమిటీ మాజీ ైచె ర్మన్ నారాయణరెడ్డి మద్దతు తెలిపారు. కుప్పం నియోజకవర్గ కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి నేతృత్వంలో రిలే నిరాహారదీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. రామకుప్పంలో ముగ్గురు యువకులు అరగుండు గీసుకుని, జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ క్రైస్తవ నాయకులు, నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి నాయకత్వంలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ మహిళా కన్వీనర్ కుసుమ నేతృత్వంలో గంగమ్మకు పొంగళ్లు పెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌కు ఆరోగ్యం సహకరించాలని వేడుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గణపతి పూజలు నిర్వహించారు. -
జగన్‌కు జనం అండ
సాక్షి నెట్వర్క్: జననేత జగన్మోహన్రెడ్డి దీక్షకు సంఘీభావంగా మూడురోజులకిందట సీమాంధ్ర జిల్లాల్లో 108 మంది చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరాలు కొనసాగుతుండగా, మంగళవారం తాజాగా 14మంది నిరవధిక నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఒక్కరోజే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 2169మంది రిలేదీక్షలు చేపట్టారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా మంగళవారం 300మంది రిలేదీక్షలు చేపట్టగా, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆత్మకూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డిల దీక్షలు బుధవారంతో మూడోరోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లాలో 31 మంది ఆమరణ దీక్షలు కొనసాగిస్తుండగా, వీరికి మద్దతుగా 152 మంది రిలే దీక్షలు చేపట్టారు. కదిరిలో మాజీమంత్రి షాకీర్, వైఎస్సార్ సీపీ నేతలు జీవీ సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షలు బుధవారం నాలుగోరోజుకు చేరాయి. విజయనగరంలో అవనాపు విజయ్‌తో సహా ఏడుగురు నేతలు చేపట్టిన నిరశన దీక్షలు మూడోరోజుకు చేరగా, మంగళవారం 96మంది రిలేదీక్షలు చేపట్టారు. తిరుపతిలో గంగమ్మకు పొంగళ్లు పెట్టి వైఎస్ జగన్‌కు ఆరోగ్యం బాగుండాలని మహిళలు మొక్కుకున్నారు. కృష్ణా జిల్లాలో పెడన మాజీఎమ్మెల్యే జోగిరమేష్, మైలవరం యువజన నేత జ్యేష్ఠ శ్రీనాథ్ చేపట్టిన దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యువనేత జక్కంపూడి రాజా, మల్కిపురంలో కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ చేపట్టిన ఆమరణ దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా, శ్రీకాకుళం జిల్లాలో 100 మంది మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా దాదాపు 150 మంది రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఒంగోలులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబుతో సహా ముగ్గురు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖనగరంలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాగరతీరంలో జలదీక్షకు దిగారు. వెఎస్సార్ జిల్లాలో ఏడుగురి ఆమరణ దీక్షలు కొనసాగుతుండగా, మంగళవారం 208మంది రిలేదీక్షలు చేపట్టారు. -
జననేతకు సంఘీభావం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు జిల్లావ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరవధిక, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఒంగోలులో విద్యార్థి విభాగం నాయకుడు రవీంద్ర నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. పెద్దారవీడులోని సానికవరంలో విద్యార్థి ఒగ్గుల లక్ష్మీరెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే సంతనూతలపాడు లో నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మార్కాపురం, కనిగిరి, కొమరోలు మండలం పుల్లారెడ్డిపల్లి, పామూరుల్లో నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. -
జగన్ దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన
-
జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు వెల్లువెత్తిన సంఘీభావం
సాక్షి, నెట్వర్క్: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సమైక్యవాదులు ఆమరణ దీక్షలకు దిగారు. అనేకచోట్ల రిలే నిరాహారదీక్షలు, మద్దతుగా ర్యాలీలు, మావనహారాలు జరిగాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజవర్గ సమన్వయకర్త షమీమ్ అస్లాం జగన్ దీక్షకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ, మదనపల్లె నియోజకవర్గ సమన్వకర్త దేశాయి తిప్పారెడ్డి చేపట్టిన దీక్షలకు రాజంపేట పార్లమెంటు నియోజవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మద్దతు పలికారు. చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో రాజా, సయ్యద్ సర్దార్, కమలాక్షి సాయిసుజిత్, మధుసూదన్‌రాయల్, కేకే.రవి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. సత్యవేడులో వైఎస్సార్ వుండల కన్వీనర్ కె.నిరంజన్‌రెడ్డి ఆవురణదీక్ష చేపట్టారు. పుంగనూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మద్దతు పలికారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త పుణ్యమూర్తి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పీలేరు సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వాల్మీకిపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరిలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ ఆధ్వర్యంలో రాస్తాకోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ సమన్వయకర్త, మాజీమంత్రి మహమ్మద్ షాకీర్తోపాటు రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కమిటీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మాధురి రాజారెడ్డి, రజనీష్కుమార్రెడ్డి, రమణారెడ్డి, అల్లాబక్ష్ ఆమరణ దీక్ష చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఎల్ఎం మోహన్‌రెడ్డి, ఒంటిమిద్ది కిరీటియాదవ్, గుంతకల్లులో ఏపీఎస్సార్టీసీ రాష్ట్రీయ మజ్దూర్ యూనియన్ డిపో గౌరవాధ్యక్షుడు ఎండీ సందీప్‌రెడ్డి, వై.సుధాకర్, మహమ్మద్ రఫీక్, బి.రాము, వినోద్‌కుమార్‌రెడ్డి ఆమరణ దీక్షలు చేపట్టారు. కడప కలెక్టరేట్ వద్ద 55 మంది ముస్లింలు ప్రారంభించిన దీక్షలకు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు,మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, జిల్లా మున్సిపల్ పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్లో మహిళలు చేపట్టిన దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజంపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలి సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలకు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ యువ నాయకుడు జక్కంపూడి రాజా రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. రాజోలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ మలికిపురం కళాశాల కూడలి వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో రెండు గంటల పాటు జలదీక్ష చేశారు. ఆలమూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి రిలేదీక్ష చేపట్టారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన రిలే దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అమలాపురం హైస్కూల్ సెంటర్లో ఏర్పాటు చేసిన రిలే దీక్షా శిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రారంభించారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేతృత్వంలో బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు పగటివేషాలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ప్రారంభించారు. గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ద్వారకాతిరుమలతో నిర్బంధ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ చలమోలు అశోక్‌గౌడ్ అధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తీన్మార్ వాయిద్యాలతో, మోటారు సైకిళ్లతో దెందులూరు, ఏలూరు, పెదపాడు మండలాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ రాజబాబు తగరపువలసలో, పీలా వెంకటలక్ష్మి, బేతిరెడ్డి విజయ్‌కుమార్, ఎం.డి.బాషా నర్సీపట్నంలో ఆమరణ దీక్షలు చేపట్టారు. తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో పాతగాజువాకలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. చోడవరంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, నాయకుడు బండారు సత్యనారాయణ రిలే దీక్షలు ప్రారంభించారు. చోడవరం, రోలుగుంట మండలాల యువజన విభాగం అధ్యక్షులు అల్లం రామ అప్పారావు, బండారు శ్రీనివాసరావు, గుడాల ప్రవీణ్‌కుమార్, కార్లె గీతాకృష్ణ, కొల్లి మురళీకృష్ణ దీక్షలో కూర్చున్నారు. పాడేరులో నియోజకవర్గ సమన్వయకర్త సీక రి సత్యవాణి ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామదేవత అసిరమ్మ తల్లికి ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు ఆధ్వర్యంలో మహిళలు ముర్రాటలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. రాజాం, రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజె బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మైలవరంలో నిరవధిక నిరాహార దీక్షను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ ప్రారంభించారు. జ్యేష్ఠ శ్రీనాథ్ మైలవరంలో ఆమరణ దీక్ష ప్రారంభించారు. విజయవాడ ఐఎంఏ హాల్ వద్ద వైఎస్సార్ సీపీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ గోసుల శివభరత్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఎన్ఎస్సీ బోస్‌నగర్‌లో విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహించారు. పెడనలో పార్టీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. నడుపూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ ఐలాండ్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు ప్రారంభమయ్యాయి. గుంటూరులో పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్లు నసీర్ అహ్మద్, షేక్ షౌకత్ ఆధ్వర్యంలో శంకర్ విలాస్సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. నరసరావుపేటలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయగిరిలో దీక్షలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో తాటి వెంకటేశ్వర్లు, కేవీ రాఘవరెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మానవహారం నిర్వహించడంతో పాటు రోడ్డుపైనే వంటావార్పు చేశారు. సంతనూతలపాడులో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ వరికూటి అమృతపాణి ఆధ్వర్యంలో రోడ్డుపైనే వైద్యశిబిరం నిర్వహించారు. సమైక్యతతోనే సంక్షేమం : దాడి విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఆంధ్ర, తెలంగాణ , రాయలసీమ ప్రాంతాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా తగరపువలసలో వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికైనా విభజనకు వ్యతిరేకమని చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ ఇచ్చి యాత్రలు చేపడితే తామే ఆహ్వానిస్తామన్నారు. దీక్షాదక్షుడు జగన్ : భూమన సాక్షి, తిరుపతి: ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే దీక్షాదక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షకు మద్దతుగా ఆదివారం తిరుపతి తుడా కార్యాలయం సమీపంలోని కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. గిరిజన లంబాడీ మహిళలు నృత్యం చేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ లక్ష్య దీక్ష, జల దీక్ష, ఫీజు పోరు, పోరు దీక్ష, కదనరంగం లాంటి కార్యక్రమాలను గతంలో పెద్దఎత్తున చేపట్టిన జగన్మోహన్రెడ్డి, ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. -
విజయమ్మ సమర దీక్షకు సంఘీభావం
సాక్షి నెట్వర్క్: అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణదీక్షకు సీమాంధ్ర జిల్లాల్లో సంఘీభావం వెల్లువెత్తుతోంది. సమరదీక్షకు మద్దతుగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నిరవధిక నిరాహార దీక్షలతో పాటు రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు పోటెత్తుతున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, కర్నూలులో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్బాష, నాగిరెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి, తాడిపత్రిలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణలు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు బుధవారంతో మూడురోజులు పూర్తి చేసుకుని గురువారంతో నాలుగోరోజుకు చేరాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో వైఎస్సార్ సీపీ నేతలు పెయ్యల చిట్టిబాబు, మిండి గోవిందరావు, పోలిశేట్టి నాగేశ్వరరావు, కాట్రు అప్పారావు, కోరుకొండలో మాజీ ఎంపీటీసీ జ్యోతుల లక్ష్మీ నారాయణ, యువజన విభాగం కన్వీనర్ గంగాధర్, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీనేతలు ఆదివిష్ణు, చింతలపూడిలో కర్రా రాజారావులు చేపట్టిన దీక్షలు మూడురోజులుగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కంభం మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ సయ్యద్‌మాబు, సూరా పాండురంగారెడ్డిలు చేపట్టిన ఆమరణ దీక్ష రెండోరోజుకు చేరింది. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.