ఇటీవల ప్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో అగ్ర సినీ తారలంతా తమదైన ఫ్యాషన్ స్టైల్‌లో మెరిశారు. ఒక్కోకరూ ఒక్కో పంథాలో తమ డిజైనర్ వేర్ డ్రస్సింగ్ స్టయిల్‌తో మెరిశారు. మరికొందరూ మాత్రం తమ ఫ్యాషన్‌కి అద్భుతమైన జోడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సరిగ్గా అలాంటి పనే చేశారు మలయాళ నటి కని కుస్రుతి. ఆమె ధరించిన పర్సు వెనుక ఉన్న స్టోరీ వింటే..వావ్..! అని మెచ్చుకోకుండా ఉండలేరు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించిన "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన డిజైన్ వేర్ దుస్తులతో మెరిశారు. అయితే ఈ వేడుకలో ఆమె చేతికి ఉన్న పుచ్చకాయను పోలిన హ్యాండ్‌బ్యాగ్ కాస్త హైలెట్‌గా నిలిచింది. ఈ వేడుకలో ఆమె స్టయిలిష్‌గా ఈ పుచ్చకాయను ధరించడానికి గల రీజన్ వింటే కంగుతింటారు.
తన ఫ్యాషన్‌తో ఈ కేన్స్ రెడ్‌కార్పెట్‌పై భారత్ తరుఫునా పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు కని. అందుకోసమే ఆమె ఈ పుచ్చకాయ హ్యండ్ బ్యాగ్‌ను ఎంచుకున్నారట. అందేంటి దీంతో సంఘీభావమా? అనుకోకండి. ఎందుకంటే ఈ పుచ్చకాయ పాలస్తీనా జెండా రంగులను పోలీ ఉంటుంది. ఎర్ర పుచ్చకాయలోని గజ్జు, నల్లగింజలు, లోపలి తెల్లని తొక్క భాగం పైన ఉండే ఆకుపచ్చని భాగం ఇవన్నీ పాలస్తీనా జెండాకు చిహ్నంగా ఉంటాయి. అందుకే దీన్ని ఎంచుకున్నారు కని.
నిజానికి ఇలా పాలస్తీనా చిహ్నంగా పుచ్చకాయ చిహ్నంగా ఉద్భవించింది 1967లో. ఇజ్రాయెల్ గాజా వెస్ట్ బ్యాంక్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని తూర్పు జెరూసలెంని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత గాజాలో పాలస్తీనా జెండాను ప్రదర్శించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ఉత్తర్వుని జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్లు పుచ్చకాయను తమ జెండాకు చిహ్నంగా ఉపయోగించారు.
ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ దాడులతో భయంకరంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 35 వేల మందికి పైగా చనిపోయారు. వారిలో సుమారు 15 వేలకు పైగా చిన్నారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఇలా కని తోపాటు కేన్స్‌లో పాలస్తీనాకు సంఘీ భావం తెలిపిన ఇతర అంతర్జాతీయ నటులు, కేట్ బ్లాంచెట్, లీలా బెఖ్తీ వంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ నటి కేట్ బ్లాంచెట్ పాలస్తీనా జెండాను అనుకరించేలా గౌను ధరించగా, బెఖ్తీ పుచ్చకాయ విత్తనాన్ని పోలిన హృదయం ఆకారపు పిన్‌ను ధరించారు.
(చదవండి: ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?)
Comments
Please login to add a commentAdd a comment