canes film festival
-
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న అవార్డ్ విన్నింగ్ సినిమా
రజత్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'సర్వైవర్'. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులను అందుకుని చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'సర్వైవర్' కావడం విశేషం. ఈ చిత్రం కూడా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ట్రైలర్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్ కూడా రజత్ రజనీకాంత్ కావడం విశేషం.ఈ చిత్రం కోసం రజత్ రజనీకాంత్ ఎంచుకున్న కథ, యాక్షన్ ఎపిసోడ్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. అదేవిధంగా రజత్ పర్ఫామెన్స్ కి మూడు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. సినిమా మీద ఉన్న మక్కువతో విభిన్నమైన చిత్రాలను మాత్రమే ఆయన నిర్మిస్తున్నారు. 2018 నుంచి మూడు సినిమాలు మాత్రమే ఆయన చేశారు. చేసిన ప్రతి సినిమాకి అవార్డు అందుకుంటున్నారు. కానీ సర్వైవర్ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు పొందారు. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు రజత్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కచ్చితంగా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో ఓటీటీలలో ట్రెండ్ అవుతున్న 'సర్వైవర్' చిత్రాన్ని మీరూ చూసేయండి. -
కేన్స్‌లో హైలెట్‌గా నటి పుచ్చకాయ హ్యాండ్‌బ్యాగ్.. వెనుక ఇంత కథా..!
ఇటీవల ప్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో అగ్ర సినీ తారలంతా తమదైన ఫ్యాషన్ స్టైల్లో మెరిశారు. ఒక్కోకరూ ఒక్కో పంథాలో తమ డిజైనర్ వేర్ డ్రస్సింగ్ స్టయిల్‌తో మెరిశారు. మరికొందరూ మాత్రం తమ ఫ్యాషన్‌కి అద్భుతమైన జోడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సరిగ్గా అలాంటి పనే చేశారు మలయాళ నటి కని కుస్రుతి. ఆమె ధరించిన పర్సు వెనుక ఉన్న స్టోరీ వింటే..వావ్..! అని మెచ్చుకోకుండా ఉండలేరు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించిన "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన డిజైన్ వేర్ దుస్తులతో మెరిశారు. అయితే ఈ వేడుకలో ఆమె చేతికి ఉన్న పుచ్చకాయను పోలిన హ్యాండ్‌బ్యాగ్ కాస్త హైలెట్‌గా నిలిచింది. ఈ వేడుకలో ఆమె స్టయిలిష్‌గా ఈ పుచ్చకాయను ధరించడానికి గల రీజన్ వింటే కంగుతింటారు. తన ఫ్యాషన్‌తో ఈ కేన్స్ రెడ్‌కార్పెట్‌పై భారత్ తరుఫునా పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు కని. అందుకోసమే ఆమె ఈ పుచ్చకాయ హ్యండ్ బ్యాగ్‌ను ఎంచుకున్నారట. అందేంటి దీంతో సంఘీభావమా? అనుకోకండి. ఎందుకంటే ఈ పుచ్చకాయ పాలస్తీనా జెండా రంగులను పోలీ ఉంటుంది. ఎర్ర పుచ్చకాయలోని గజ్జు, నల్లగింజలు, లోపలి తెల్లని తొక్క భాగం పైన ఉండే ఆకుపచ్చని భాగం ఇవన్నీ పాలస్తీనా జెండాకు చిహ్నంగా ఉంటాయి. అందుకే దీన్ని ఎంచుకున్నారు కని. నిజానికి ఇలా పాలస్తీనా చిహ్నంగా పుచ్చకాయ చిహ్నంగా ఉద్భవించింది 1967లో. ఇజ్రాయెల్ గాజా వెస్ట్ బ్యాంక్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని తూర్పు జెరూసలెంని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత గాజాలో పాలస్తీనా జెండాను ప్రదర్శించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ఉత్తర్వుని జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్లు పుచ్చకాయను తమ జెండాకు చిహ్నంగా ఉపయోగించారు.ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ దాడులతో భయంకరంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 35 వేల మందికి పైగా చనిపోయారు. వారిలో సుమారు 15 వేలకు పైగా చిన్నారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఇలా కని తోపాటు కేన్స్‌లో పాలస్తీనాకు సంఘీ భావం తెలిపిన ఇతర అంతర్జాతీయ నటులు, కేట్ బ్లాంచెట్, లీలా బెఖ్తీ వంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ నటి కేట్ బ్లాంచెట్ పాలస్తీనా జెండాను అనుకరించేలా గౌను ధరించగా, బెఖ్తీ పుచ్చకాయ విత్తనాన్ని పోలిన హృదయం ఆకారపు పిన్ను ధరించారు. (చదవండి: ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?) -
కేన్స్ ఫెస్టివల్లో హైలెట్‌గా 'కృష్ణ గువా నవరత్న హారం'!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లు, గౌన్లు, వెస్ట్రన్ డ్రెస్‌లతో మెరిశారు. వారిలో అస్సాంకి చెందిన నటి మాత్రం భారతీయ సంప్రదాయ చీరలో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే కోవలోకి ప్రస్తుతం వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త నిదర్శన గోవాని గావిన్ మిగ్యుల్ చేరిపోయారు. గోవాని కూడా అస్సాం నటి మాదిరి సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై జర్జోజీ ఎంబ్రాయిడరీ చీరతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె ధరించిన చీరను వందమంది చేనేత వాళ్ళు తమ కళా నైపుణ్యంతో గ్లామరస్‌గా రూపొందించారు. అయితే ఈ వేడుకలో ఆమె చీర కంటే..గోవాని ధరించిన హారమే హైలెట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరూ తమదైన స్టైల్‌తో ఆకట్టుకోగా, గోవాని మాత్రం అత్యంత అరుదైన లగ్జరీయస్ జ్యువెలరీతో చూపురుల దృష్టిని తనవైపుకి తిప్పుకునేలా చేశారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించి జ్యువెలరీని కృష్ణ గువా నవరత్న హారం అని అంటారు. ఇది వందేళ్ల నాటి పురాతన నగ. దీన్ని మీనా జాదౌ జ్యువెలరీ వ్యాపారి ఘనాసింగ్ బిట్రూ రూపొందించారు. ఈ నెక్లెస్‌ని తయారు చేయడానికి సుమారు 200 మంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో 1800 గంటలు శ్రమకు ఓర్చి మరీ రూపొందించారు. నిజానికి ఈ నగలో వజ్రాన్ని పాశ్చాత్య కట్టింగ్ పద్ధుతును పక్కన పెట్టి పురాతన కటింగ్ పద్ధతిలో పోల్కీ వజ్రాలతో రూపొందించారు.పోల్కీ వజ్రాల చరిత్ర..ఇవి దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఉద్భవించాయి. ఈ వజ్రాలను నాటికాలంలో మహారాజులు బాకులు, ప్లేట్లు, చెస్ సెట్లు, అద్భుతమైన నెక్లస్లలో ఈ పోల్కీ వజ్రాలను ఉపయోగించేవారు. View this post on Instagram A post shared by Nidarshana Gowani (@nidarshana_gowani) (చదవండి: ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..) -
కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అక్కడున్న వారందర్నీ తమ స్టన్నింగ్ లుక్‌తో మైమరిపించారు. అందాల సుందరీ, బాలీవుడ్ నటి ఐశ్వర్యారయ చక్కటి డిజైనర్ గౌనుతో అలరించిగా, మిగతా సెలబ్రిటీలో తమదైన శైలిలో మిస్మరైజ్ చేశారు.ఇక సూపర్ మోడల్, మాజీ మిస్ ఎర్త్ ఇండియా, బాలీవుడ్ నటి శోభితా ధూళిపాళ కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే శోభితా తొలిసారిగా ఈ రెడ్‌కార్పెట్‌పై మెరిశారు. ఆమె ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో అధ్భతంగా కనిపించారు. శోభిత నమ్రత జోషిపురా జంప్‌సూట్ ధరించి రెడ్‌కార్పెట్‌పై ర్యాంప్ వాక్ చేసింది. ఆమె అత్యుత్తమ స్టైల్‌ని ఎంపిక చేసుకుని మరీ ఈ వేడుకలో మెరిశారు. మిరుమిట్లు గొలిపే ఊదారంగు డ్రస్‌లో ఆకర్షణీయంగా కనిపించారు. దానిపై ఉన్న సీక్విన్ వర్క్ శోభితా లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. వీ నెక్ డ్రస్‌కి తగ్గట్టుగా ఉంగరాల జుట్టుతో గ్లామరస్‌గా కనిపించింది శోభిత. అయితే ఆమె ధరించి డిజైనర్‌వేర్ ప్రధాన ఆకర్షణగాక కనిపించినప్పటికీ..ఇది గతంలో అతియ శెట్టి ధరించిన డిజైనర్‌వేర్‌కి దగ్గరగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతియా 2023లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఇదే నమ్రత జోషిపురా జంప్‌సూట్ డిజైనర్‌వేర్‌ని ధరించింది. రెండు కలర్లు కొంచెం వేరుగానీ డిజైన్ దగ్గరగా దగ్గరగా ఒకేలా ఉండటం విశేషం. ఇక శోభితా సెలక్ట్ చేసుకున్న ఈ డిజైనర్ వేర్ ధర ఏకంగా రూ. 1.8 లక్షలు ధర పలుకుతుందట. View this post on Instagram A post shared by A Fashionista's Diary (@afashionistasdiaries) (చదవండి: ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!) -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023.. తారల సొగసులు
ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారత సినీ తారలు మెరుస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ వేడుకలు 27 వరకు జరుగుతాయి. ఇప్పటికే కాన్స్ రెడ్ కార్పెట్‌పై సారా అలీఖాన్, ఈషా గుప్తా, ఊర్వశీ రౌతేలా క్యాట్ వాక్‌తో ఆకట్టుకున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్ తాజాగా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, ఖుష్భూ, అమీ జాక్సన్, దర్శక–రచయిత, నిర్మాత, నటుడు విఘ్నేష్ శివన్, దర్శక–నటుడు ప్రదీప్ రంగ నాథన్లు పాల్గొన్నారు. ఇక మృణాల్ ఠాకర్, ఐశ్వర్యా రాయ్ అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. మొత్తానికి కాన్స్‌లో దేశీ హంగామా బాగానే కనబడుతోంది. -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’
‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందించిన 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్'మూవీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు సిద్ధమైంది. మే 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శించబడుతోంది. 2022 అమెరికన్ రొమాంటిక్-థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్' సినిమా ఇదివరకే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. క్రిష్ ముద్రగడ, మటిల్డా ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ళ అనుభవంతో ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరపైకి తీసుకు వచ్చారు. దర్శకుడిగా అతని చివరి కన్నడ చిత్రం 'వాసు నాన్ పక్కా కమర్షియల్' పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. -
ముఖమంతా మొటిమలు, సిగ్గు, బిడియం.. కానీ ఇప్పుడు
ముఖం అంతా మొటిమలు, నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలంటే సిగ్గు, బిడియంగా ఫీల్ అయ్యే ఆ అమ్మాయే తొలి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగి కేన్స్ ఫిల్మ్ఫెస్టివల్ల్లో రెడ్‌కార్పెట్‌పై నడిచింది. తన ఫ్యాషన్‌తో మెబిలిన్ వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేయడమే గాక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అనర్గళంగా మాట్లాడింది. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఏదో సినిమా కథ కాదు. Indian Influencer Diipa Khosla: భారతీయ కట్టుబొట్టుకు సరికొత్త ఫ్యాషన్‌ను జోడించి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగిన దీపా ఖోస్లా ప్రేరణాత్మక స్టోరీ. పదిలక్షలకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో దూసుకుపోతూ ఏడు అంతర్జాతీయ మ్యాగజీన్ కవర్లపై ఫోటోకు పోజు ఇవ్వడమేగాక, వోగ్, ఎల్లే, గ్రాజియా వంటి ప్రముఖ సంస్థల నుంచి వరుసగా మూడేళ్లు ‘ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌ను గెలుచుకోవడం, బిల్‌బోర్డుపై తన ఫోటో రావడం విశేషం. ఢిల్లీలో నివసిస్తోన్న సంప్రదాయ పంజాబీ కుటుంబంలో పుట్టిన దీపా ఆరేళ్లపాటు ఢిల్లీలోనే ఉంది. తరువాత దీపా తల్లిదండ్రులు తమ మకాంను ముందు చెన్నైకి, తరువాత ఊటీకి మార్చడంతో తన బాల్యం అంతా అక్కడే గడిచింది. ఊటీలోని బ్రిటిష్ బోర్డింగ్ స్కూల్లో చదివిన దీపా తరువాత న్యాయ విద్యను అభ్యసించేందుకు స్కాలర్షిప్ రావడంతో.. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డామ్‌లో అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రధాన సబ్జెక్టుగా లా డిగ్రీని పూర్తిచేసింది. ఆ తరువాత మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు లండన్‌కు వెళ్లింది. పీజీ అయ్యాక లాయర్‌గా ప్రాక్టీస్ చేయడానికి మధ్యలో నాలుగు నెలల ఖాళీ దొరికింది. ఈ సమయంలో లండన్ ఫ్యాషన్ ఏజెన్సీలో చేరి ఇంటర్న్‌షిప్ చేసింది. ఫ్యాషన్‌పై ఆసక్తి పెరగడంతో.. యూరప్ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెన్సీ లో చేరింది. ఒక్కోటీ నేర్చుకుంటున్న క్రమంలో... అమెరికా, యూరప్ దేశాల నుంచి నుంచి వచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను దగ్గర నుంచి గమనించేది. ‘ఇన్నిదేశాల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కానీ ఇండియా తరపున ఎవరూ లేరు. నేను ఆ లోటు భర్తీ చేయాలి’ అనుకుంది. లైంగిక వేధింపులు, వర్ణ వివక్షత వంటి సమస్యలు ఎదురైనప్పటికీ తనలోని నైపుణ్యాలతో కష్టపడి సత్తా చాటì , ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగింది. రెడ్‌కార్పెట్‌పై బ్రెస్ట్ పంప్స్‌తో.. ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తూ ఎస్టీ లాడర్, కెరాస్టేస్ బ్రాండ్లకేగాక మరెన్నో ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేసింది. కేన్స్, వెనిస్ చిత్రోత్సవాల్లో సెలబ్రెటీ హోదాల్లో పాల్గొంది. 2019లో పోస్ట్ ఫర్ చేంజ్ ఫౌండేషన్‌ను ప్రారంభించి...సోషల్ మీడియా ద్వారా సామాజిక మార్పుకోసం, మహిళా అభ్యున్నతి కోసం కృషిచేస్తోంది. స్త్రీ సాధికారత, జాత్యహంకార ధోరణికి వ్యతిరేకంగా యూఎన్, ఇతర ఎన్జీవోలతో కలసి పనిచేస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న కేన్స్ ఫెస్టివల్లో పాల్గొని సెన్సేషనల్‌గా నిలిచింది. నలుపు, పసుపు రంగు గౌనులో మెరిసిన దీపా తన గౌనుకు బ్రెస్ట్ పంప్స్‌ను అమర్చుకుని రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు పోజులిచ్చి తల్లిపాల ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పింది. నెదర్లాండ్స్‌లో చదివే రోజుల్లో ఒలేగ్ బుల్లర్‌ను ప్రేమించిన దీపా తరువాత అతడినే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఒక పాప. 2015 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ..ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్, బ్యూటీహ్యాకర్గా ఆకట్టుకుంటున్నారు. తన పేరుతో బ్లాగ్ నడుపుతూ ట్రావెల్ స్టోరీలు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ టిప్స్, సలహాలు అందిస్తున్నారు. -
భావోద్వేగాల్లో అస్సలు మార్పు ఉండదు!
బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించిన నటి హీనాఖాన్ త్వరలోనే బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. సీరియళ్లతో పాటు బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన హీనా ప్రస్తుతం.. కాన్స్ ఫెస్టివల్లో బిజీగా గడుపుతున్నారు. ఫ్రెంచ్ రివెరా నదీ తీరాన జరుగుతున్న ఈ మెగా సినీ ఈవెంట్లో తొలిసారిగా పాల్గొన్న ఆమె.. పొడవాటి గౌన్లతో ఎర్ర తివాచీ హొయలొలికిస్తున్నారు. అంతేకాక సినిమాల్లోకి రాకముందే ఈ గౌరవం దక్కించుకున్న నటిగా గుర్తింపు పొందారు. ఇక అక్కడే తన తెరంగేట్రానికి సంబంధించిన లుక్‌ను విడుదల చేసి మరిన్ని మధుర ఙ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. కాగా హుస్సేన్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైన్స్ సినిమాతో హీనాఖాన్ బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. కేన్స్ ఫెస్టివల్లో భాగంగా ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆమె ఆవిష్కరించారు. ఇందుకు సబంధించిన ఫొటోను షేర్ చేసిన హీనా..‘ సరిహద్దుల్లో జీవించినంత మాత్రాన భావోద్వేగాలు మారవు. సగటు అమ్మాయి ఎదుర్కొనే సవాళ్లకు నజియా జీవితంలోనూ ఉంటాయి. అయితే అవి అంత తేలికైనవి కావు. లైన్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా. ఈ సినిమాకు మీ అందరి ఆశ్వీరాదాలు ఉంటాయని ఆశిస్తున్నా’ అంటూ తన పాత్ర విశేషాలను వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా హీనాపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ఇక ‘పెళ్లంటే నూరేళ్లపంట’ సీరియల్లో అక్షరగా హీనా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Emotions don’t change because of the borders in between, the life and plight of #Nazia is a simple portrayal of any girl who faces the magnitude of ordinary challenges in a not so ordinary story. #Lines is my debut in films. I hope you all love it as much we loved it. This is the first look launched at @festivaldecannes and an official poster which depicts more than a poster can! @rahatkazmi @tariq_khana @zebasajid2 @rockyj1 @rishi_bhutani @husseinkhan72 @pinkuchauhan8 @d.avaniish #cannes2019 A post shared by Hina Khan (@realhinakhan) on May 17, 2019 at 9:32am PDT -
భర్తే తన ఫేవరెట్ అంటున్న నటి
అందానికే అసూయ పుట్టించే అందగత్తే ఐశ్వర్యరాయ్ బచ్చన్. ఈ మాజీ ప్రపంచ సుందరిని ఇష్టపడని వారుండరు. ఆమెతో కలిసి ఒకసారైనా నటించాలని హీరోలు అందరూ కోరుకుంటారు. మరి ఇంతకు ఈ ముద్దుగుమ్మకు ఇష్టమైన నటుడెవరో తెలుసా? ఇంకెవరు తన భర్త అభిషేక్ బచ్చనే. ఈ విషయాన్ని ఐష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు ఇష్టమైన నటుడు నా భర్త అభినే. మేమిద్దరం జంటగా నాలుగైదు సినిమాల్లో నటించాం. అభి సినిమాల్లో సాధారణ వ్యక్తిలాగే కన్పిస్తాడు. సూపర్‌స్టార్ కొడుకైనప్పటికి అభిషేక్‌లో ఆ గర్వం ఉండదు. ముక్కుసూటి మనిషి. అదే తనలో నాకు నచ్చిన విషయం. ఇప్పటికీ మా ఇద్దరితో సినిమాలు తీయడానికి దర్శకులు మంచి స్క్రిప్ట్‌లతో వస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇద్దరం ఓ సినిమా చేయబోతున్నాం. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాన’ని ఐశ్వర్యరాయ్ తెలిపారు. గతంలో వీరిద్దరూ ‘గురు’, ‘ఉమ్రావ్ జాన్’, ‘రావణ్’, ‘కుచ్ నా కహో’ చిత్రాల్లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఐష్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకకు హాజరయ్యారు. తల్లీకూతుళ్లిద్దరూ ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఐష్ ‘ఫ్యానే ఖాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెకు జోడీగా రాజ్‌కుమార్ రావ్, అనిల్ కపూర్ నటిస్తున్నారు. మరోపక్క అభిషేక్ బచ్చన్ ‘మన్మర్జియా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. -
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఐశ్వర్య ప్రత్యేక ఆకర్షణ
-
పెళ్లికళ వచ్చేసింది
మే 8... మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12:30. ఈ డేట్ అండ్ టైమ్ స్పెషాల్టీ ఏంటీ అనుకుంటున్నారా? బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌కు శ్రీమతిగా కొత్త జీవితం ఆరంభమయ్యే ముహూర్తపు టైమ్ అది. అవును.. ఇక నో మోర్ డౌట్స్. సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజాల వివాహం మే 8న ముంబైలో జరగనుంది. అన్నట్లు ఇంకో మాట.. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగూ లంచ్ ఉంది. అలాగే అదే రోజు రాత్రి పార్టీ కూడా ఎరేంజ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఆల్రెడీ సోనమ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయ్యింది. పెళ్లి జరగడానికి ఇంకా నాలుగు రోజులు ఉన్నా.. అప్పుడే సోనమ్ కపూర్ ఫేస్‌లో పెళ్లి కళ వచ్చేసిందని ఆమె సన్నిహితులు సరదాగా ఆటపట్టిస్తున్నారట. ఆల్రెడీ సోనమ్ కపూర్ ఇల్లు పెళ్లి ఏర్పాట్లతో హడావిడిగా మారింది. అలంకరణ కూడా పూర్తి అయ్యింది. పెళ్లి వేడుకలకు ధరించబోయే డిజైనర్ డ్రెస్సులను తన అభిరుచికి తగ్గట్టుగా చేయించుకున్నారట సోనమ్. ‘ఫ్యాషన్ ఐకాన్’ అని పేరు తెచ్చుకున్న సోనమ్ పెళ్లి వేడుకల్లో ధరించబోయే దుస్తులు ఎలా ఉంటాయో చూడాలని చాలామంది వెయిటింగ్. ఇక సోనమ్ కపూర్ కాబోయే భర్త ఆనంద్ ఆహుజా గురించి చెప్పాలంటే ఆయన వ్యాపారవేత్త. సోనమ్ పెళ్లికి దీపిక రాదా? యస్.. సోనమ్ పెళ్లికి దీపికా పదుకొన్ హాజరు కావడం లేదా? అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అందుకు తగ్గట్లు ఒక విశ్లేషణను చెబుతున్నాయి. టైమ్ మ్యాగజీన్ వంద మంది మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్స్‌లో ఒకరుగా దీపికా పదుకొన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న టైమ్ మ్యాగజీన్ జరపనున్న ఓ ఈవెంట్లో పాల్గొనున్నారు దీపిక. ఆ నెక్ట్స్ మే 8 నుంచి 19 వరకు జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాల్సి ఉందట. సో.. సోనమ్ పెళ్లికి దీపికా రావడం లేదట. -
ఐష్ ఫస్ట్ లేడీ
మాజీ ప్రపంచ సుందరి, కథానాయిక ఐశ్వర్యారాయ్ ‘ఫస్ట్ లేడీ’ పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు ఏటా ఈ అవార్డులు ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఇరవై ఏళ్లుగా ఐశ్వర్యారాయ్ సినీరంగానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘ఫస్ట్ లేడీ’ అవార్డును ఐశ్వర్యకి అందజేశారు. 2002 నుంచి ప్రతి ఏటా కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటున్న ఐశ్వర్య ఇటీవల జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ‘కేన్స్’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ నటి ఐష్ కావడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఆమెను ఘనంగా సత్కరించారు. కాగా, చిన్న వయసులోనే పైలెట్ అయిన ఆయేషా అజీజ్, కశ్మీర్‌కి చెందిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి రువేదా సలామ్‌లతో పాటు మరో 113 మందికి ‘ఫస్ట్ లేడీ’ పురస్కారాలు అందించారు. -
ఆ సినిమా షూటింగ్ కష్టంగా అనిపించింది!
లాస్ ఏంజిల్స్: మ్యాడ్ మ్యాక్స్:ఫ్యూరీ రోడ్.. ఇదో హాలీవుడ్ యాక్షన్ చిత్రం. బ్రిటీష్ నటులు నికోలస్ హాల్ట్, టామ్ హార్డీలు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం కేన్స్ లో జరుగుతున్న 68 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది. కాగా, మ్యాడ్ మ్యాక్స్ చిత్రంలో తాను ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర అనుభవాలను నటి కార్లీజీ థెరోన్ వెల్లడించింది 'నేను ఆ చిత్రంలో ఓ దత్త కుమారునికి తల్లిగా నటించాను. ఆ పాత్రలో జాక్సన్ అనే మూడు నెలల బాబును దత్తత తీసుకుని ఆలనా పాలనా చూడాల్సిన పాత్ర. ఈ క్రమంలోనే ఓ రాత్రి ట్రైన్లో షూటింగ్ జరుగుతోంది. ఆ రాత్రంతా బాబు నిద్రపోలేదు. నిజంగా ఆ సమయంలో చిత్ర షూటింగ్ చాలా కష్టంగా అనిపించింది' అని థెరోన్ పేర్కొంది. ఈ చిత్రంలోటైటిల్ రోల్ పాత్రలు పోషించిన నికోలస్ హాల్ట్, టామ్ హార్టీలపై థెరోన్ ప్రశంసల వర్షం కురిపించింది. వీరిద్దరూ తమ పాత్రల్లో లీనమై నటించడమే కాకుండా.. చాలా గొప్పగా ఆకట్టుకున్నారని పేర్కొంది.