భావోద్వేగాల్లో అస్సలు మార్పు ఉండదు! | Hina Khan Shares Her First Look In Debut Film | Sakshi

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హీనాఖాన్‌

May 18 2019 8:00 PM | Updated on May 18 2019 8:01 PM

Hina Khan Shares Her First Look In Debut Film - Sakshi

సగటు అమ్మాయి ఎదుర్కొనే సవాళ్లకు నజియా జీవితంలోనూ ఉంటాయి.

బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించిన నటి హీనాఖాన్‌ త్వరలోనే బాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. సీరియళ్లతో పాటు బిగ్‌బాస్‌ షో ద్వారా పాపులర్‌ అయిన హీనా ప్రస్తుతం.. కాన్స్‌ ఫెస్టివల్‌లో బిజీగా గడుపుతున్నారు. ఫ్రెంచ్‌ రివెరా నదీ తీరాన జరుగుతున్న ఈ మెగా సినీ ఈవెంట్‌లో తొలిసారిగా పాల్గొన్న ఆమె.. పొడవాటి గౌన్లతో ఎర్ర తివాచీ హొయలొలికిస్తున్నారు. అంతేకాక సినిమాల్లోకి రాకముందే ఈ గౌరవం దక్కించుకున్న నటిగా గుర్తింపు పొందారు. ఇక అక్కడే తన తెరంగేట్రానికి సంబంధించిన లుక్‌ను విడుదల చేసి మరిన్ని మధుర ఙ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు.

కాగా హుస్సేన్‌ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైన్స్‌ సినిమాతో హీనాఖాన్‌ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. కేన్స్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆమె ఆవిష్కరించారు. ఇందుకు సబంధించిన ఫొటోను షేర్‌ చేసిన హీనా..‘ సరిహద్దుల్లో జీవించినంత మాత్రాన భావోద్వేగాలు మారవు. సగటు అమ్మాయి ఎదుర్కొనే సవాళ్లకు నజియా జీవితంలోనూ ఉంటాయి. అయితే అవి అంత తేలికైనవి కావు. లైన్స్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా. ఈ సినిమాకు మీ అందరి ఆశ్వీరాదాలు ఉంటాయని ఆశిస్తున్నా’ అంటూ తన పాత్ర విశేషాలను వెల్లడించారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా హీనాపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ఇక ‘పెళ్లంటే నూరేళ్లపంట’ సీరియల్‌లో అక్షరగా హీనా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement