
బుల్లితెర నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. హీనా ఖాన్‌కు ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీ ఉండడంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. ఇటీవలే ఆమెకు కీమోథెరపీ కూడా చేశారు. ఇలాంటి సమయంలో అమ్మ ప్రేమ తనపై చూపించిన ప్రేమను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
హీనా ఖాన్ తన ఇన్‌స్టాలో.. 'మనకు ఏదైనా జరిగిన తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో నాకు అర్థమైంది. తన పిల్లలకు ప్రేమ, సాంత్వన అందించడానికి ఎంత బాధనైనా భరిస్తుంది. నా రోగం గురించి తెలుసుకున్న రోజు ఆమె అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. కానీ ఆమెనే నన్ను పట్టుకుని తన బాధను మరచిపోయేందుకు యత్నించింది. తల్లులే ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక సూపర్ పవర్. ఆమె ముందు ప్రపంచం కూడా చిన్నదే. ఆమె తన చేతుల్లో నన్న ఓదార్చి నాకు బలాన్ని ఇవ్వడానికి ఎంతో తపన పడింది' అంటూ పోస్ట్ చేసింది. తల్లి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
కాగా.. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో ఫేమస్ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్‌లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment