క్యాన్సర్‌తో పోరాడటం అంత ఈజీ కాదు. అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ మహమ్మారిని జయించే దిశగా పోరాడుతోంది హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్. ప్రస్తుతం తనకు రొమ్ము క్యాన్సర్ మూడో స్టేజీలో ఉండటంతో వెంటనే కీమో థెరపీ ప్రారంభించారు.
సైడ్ ఎఫెక్ట్స్
అయితే వరుస కీమోథెరపీల వల్ల తన శరీరంపై కాలిన మచ్చలు ఏర్పడటంతో పాటు తాజాగా మ్యుకోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. కీమో థెరపీ చేయించుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టే మ్యుకోసైటిస్. వైద్యుల సూచన మేరకు దానికి కూడా చికిత్స తీసుకుంటున్నాను. మీలో ఎవరికైనా దీన్ని ఎలా నివారించాలో తెలిస్తే దయచేసి నాకు సాయం చేయండి.
సలహా ఇవ్వండి
ఎందుకంటే భోజనం కూడా చేయలేకపోవడం చాలా కష్టం కదా! మీరు ఇచ్చే సలహాలు నాకెంతో మేలు చేస్తాయి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వైద్యుల చికిత్సనే ఫాలో అయిపో.. పొరపాటున సొంత ప్రయోగం వికటించిందంటే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది అని కొందరు హెచ్చరించారు.
మ్యుకోసైటిస్ అంటే..
కీమోథెరపీ దుష్ప్రభావాల్లో మ్యుకోసైటిస్ అనేది ఒకటి. దీనివల్ల గొంతు, నోరు, అన్నవాహిక, కడుపు, పేగుల్లో ఉండే శ్లేష్మపొరలు వాచిపోతాయి. నోటిలో అల్సర్లు కూడా కనిపిస్తాయి. దీనివల్ల ఆహారం తినలేరు, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు. కొందరికైతే నోటి నుంచి రక్తం కూడా వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment