Ajithvasan A Beautiful Breakup Film To Be Screened At Cannes 2022 Film Festival, Details Inside - Sakshi
Sakshi News home page

A Beautiful Breakup Film In Cannes 2022: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ 

May 25 2022 5:08 PM | Updated on May 25 2022 7:38 PM

Ajithvasan A Beautiful Breakup Film To Be Screened At Cannes 2022 Film Festival - Sakshi

‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందించిన 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్'మూవీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు సిద్ధమైంది. మే 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబడుతోంది. 2022 అమెరికన్ రొమాంటిక్-థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్' సినిమా ఇదివరకే విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమాకు అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. క్రిష్ ముద్రగడ, మటిల్డా ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ళ అనుభవంతో ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరపైకి తీసుకు వచ్చారు. దర్శకుడిగా అతని చివరి కన్నడ చిత్రం 'వాసు నాన్ పక్కా కమర్షియల్' పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement