సంగీత జ్ఞానిగా ఇళయరాజా(Ilayaraja) ఎంతో పేరు సాధించారు. ఆయన సంగీత ప్రయాణంలో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే.. ఇప్పటి తరం వారు కూడా ఆయన సంగీతానికి ఫిదా అవుతారు. మైమరిచి ఆయన పాటలు వింటారు. 35 రోజుల్లో సింపోనిని రూపొందించవచ్చని నిరూపించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. అయితే ఈయనపై వివాదాలు లేవని చెప్పలేం.
ఇటీవల ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ... 'నేను సంగీతాన్ని అందించిన పలు పాటల ద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేసి మీకు నేర్పించాను. సంగీత దర్శకులు మొజార్ట్, పోతోవన్ బంటి పేర్లు మీకందరికీ ఎలా తెలుసు ? వారి గురించి మీకు చెప్పింది ఎవరు? నేనే వారిని మీకు పరిచయం చేశాను. ఒక సంగీత అభిమానికి పలు విధాలుగా ప్రపంచ సంగీతాన్ని నా పాటల ద్వారా పరిచయం చేశాను. నేను సింపోనిని రూపొందించాను. అంటే నాకు సంగీతం అంటే అంత ఆసక్తి అని మీరు తెలుసుకోవాలి. ఇలా అనడం కొందరికి కడుపు మంట కావచ్చు.అయితే నా సంగీతం అందరి జీవితాల్లోనూ ఉంటుంది. అలాగని మీరు అడగ్గానే సంగీతాన్ని అందిస్తే నేను శరవణ భవనం (హోటల్) అవుతాను.
నా సంగీతాన్ని విని చిన్న బిడ్డ తిరిగి ప్రాణం పోసుకుంది. ఒక ఏనుగుల గుంపు నా పాటలు వినడానికి వచ్చాయి. ఇవన్నీ చెబితే నాకు గర్వం, పొగరు అంటారు. అయినా గర్వం నాకు గాక వేరే వారికి ఎందుకు వస్తుంది? నిజమే నాకు పొగరు ఎక్కువే. ప్రపంచంలోనే ఎవరు చేయలేని దానిని నేను చేశాను. అలాంటప్పుడు నాకేగా పొగరు ఉండాలి. ప్రతిభ ఉన్నవారికే గర్వం ఉంటుంది.' అని ఇళయరాజా పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment