పాలకుర్తి టౌన్ (వరంగల్ జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీటీడీపీ శాసనసభాపక్ష నాయకులు ఎమ్మెల్యే ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహదేవాలయం ఆవరణలో అర్చకుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. 010 పద్దు కింద అర్చక ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలనే న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. డిమాండ్లు సాధించుకునే వరకు ఆందోళన విరమించొద్దని ఆయన అర్చకులను కోరారు.
ఈ కార్యక్రమంలో అర్చక ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ డివీఆర్ శర్మ తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు గంగు కృష్ణమూర్తి,మండల పార్టీ అద్యక్షులు నల్ల నాగిరెడ్డి, సర్పంచ్ అంగడి అంజమ్మ, ఎంపీటిసి ఫోరం జిల్లా కార్యదర్శి కత్తి సైదులు, సర్పంచులు మాచర్ల పుల్లయ్య, వేల్పుల లక్ష్మి దేవరాజ్, నాయకులు కడుదల కర్నాకర్ రెడ్డి, కారుపోతుల కుమార్, పాలెపు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్చకుల సమస్యలు అసెంబ్లీలో చర్చిస్తా- ఎర్రబెల్లి
Published Mon, Aug 31 2015 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM
Advertisement
Advertisement