
సమైఖ్య శంఖారావంకు లండన్ నుంచి సంఘీభావం
లండన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లో ఎల్బి స్టేడియంలో ఈ నెల 26న నిర్వహించే సమైఖ్య శంఖారావం బహిరంగ సభకు ఆ పార్టీ యుకే - యూరప్ విభాగం సంఘీభావం తెలిపింది. 'సమైఖ్య శంఖారావం' బహిరంగ సభకు పూర్తి మద్దతు తెలుపుతూ లండన్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా వంగల సందీప్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, పరిపాలనా అనిశ్చితికి టీడీపి-కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలే కారణం అన్నారు. వారు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి కుటిల రాజకీయాలు చేస్తున్నందున ప్రజలు జగన్ పక్షాన వున్నారన్నారు. సమైఖ్య శంఖారావం సభ ఎవరికీ వ్యతిరేఖంగా నిర్వహిస్తున్న సభ కాదని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరిని ఎండగట్టడంతో పాటు మెజారిటీ ప్రజల అభిష్టాలకు విరుద్దంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండుతో సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. అందువల్ల మనమందరం మన వంతు కృషి చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. 'రాజన్న రాజ్యం' ఆవశ్యఖతను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపు ఇచారు.
నాగేందర్ మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయతే జగన్ అన్న డిఎన్ఏ అన్నారు. రాజన్న అలాంటి పరిపాలనా దక్షత జగనన్నకే సాధ్యం అని చెప్పారు. వైఎస్ అవినాష్ రెడ్డి, మేడపాటి వెంకట్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా తమసందేశాన్ని అందించారు.
ఈ సమావేశంలో నవీన్ రెడ్డి, సురేష్ రెడ్డి ముదిరెడ్డి, సురేష్ తుమ్మల, నిత్యానంద రెడ్డి మాట్లాడారు. సమావేశ ప్రాంగణం అంతా జై జగన్, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అన్న నినాదాలతో దద్దరిల్లింది.