నవభారత్ ఆవిష్కరణ
‘‘దేశ స్థూలజాతీయోత్పత్తి శరవేగంగా పెరుగుతోంది. వ్యవసాయం నుంచి తయారీ రంగం వరకు అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపి స్తోంది. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. సామాన్యులు తాము కన్న కలలు తీర్చుకునే అవకాశాలు వస్తాయి. ప్రధాన మంత్రి మోదీ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడూ చూడని నవ భారతం ఆవిష్కృతమవుతోంది. ప్రధానికి అభినందనలు’’ – అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు
ఉద్యోగ ఆశలకూ పరిమితి
‘‘ఇవాళ రేపు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తాపత్రయపడు తున్నారు. అందరూ తమ జీవితం సాఫీగా సాగిపోవాలని అను కుంటున్నారు. ఒక్క పోస్టుకి లక్షల్లో దర ఖాస్తులు వస్తున్నాయి. కానీ, జీవితం ఎల్ల వేళలా నిశ్చింతగా ఉండదు. అధిక ఆశలు మనకి సమస్యలనే మిగులుస్తాయి’’
– అభిషేక్ మిశ్రా, వీహెచ్‌పి కార్యకర్త
వ్యక్తి స్వాతంత్య్ర హరణం
‘‘స్వాతంత్య్రం అనేది ఉన్నట్టుండి కోల్పోయే అంశంగా ఉండదు. అంతి మంగా మనలో ప్రతి ఒక్కరి స్వాతంత్య్రం హరించుకు పోయేం తవరకు.. ఒక వ్యక్తి, ఒక కార్యకర్త, ఒక లాయర్, ఒక రచయిత, ఒక మేధావి నిత్యం తమ స్వాతంత్య్రాన్ని విడివిడిగా కోల్పోతూనే ఉంటారు’’ – ట్వింకిల్ ఖన్నాబాలీవుడ్ నటి
ఉపాధి కల్పన హరీ
‘#rupee@71.. మన దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమై పోయింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, తదితర తప్పుడు విధానపరమైన నిర్ణయాలు ఒకవైపు... ఆకాశాన్నంటే పెట్రోల్, డీజీల్ ధరలు మరోవైపు దేశ ప్రజల్ని నిత్య కష్టాల్లోకి నెట్టేశాయి. కేవలం 10–15 టాప్ కంపెనీలకు మాత్రమే దేశంలో పని ఉంది. మిగిలిన వారికి ఉద్యోగాల్లేవు. చిన్నా చితకా వ్యాపారాలు ప్రస్తుతం నడవట్లేదు. కేంద్రం తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాలతో రైతులే కాదు సమాజంలోని అన్ని వర్గాల వారు చాలా బాధలు పడుతున్నారు.’’ – శరద్ యాదవ్‌మాజీ కేంద్ర మంత్రి
రాఫెల్ బాంబులు
‘‘రాఫెల్ విమానాలు చాలా వేగంగా, సుదూరంగా ప్రయాణిస్తు న్నాయి. త్వరలోనే ఈ విమానాలు అతి పెద్ద బాంబుల్ని పేల్చబోతు న్నాయి. మోదీజీ కాస్త అనిల్‌కు చెప్పండి. ఫ్రాన్స్‌లో చాలా పెద్ద సమస్య ఉంది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment