
'పద్మ అవార్డులను నిలిపేయండి'
న్యూఢిల్లీ:పద్మ అవార్డుల ఎంపిక అనేది నీతి నిజాయితీగా జరగడం లేదంటూ జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ కొత్త గళం అందుకున్నారు. పద్మ అవార్డులను అత్యధిక మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నందున వాటిని నిలిపివేయాలంటూ సరికొత్త వివాదానికి తెరలేపారు. 'పద్మ అవార్డుల అనేవి కేవలం కొంతమంది చేతుల్లోకి మాత్రమే వెళుతున్నాయి. జనతా పరివార్ పాలనలో ఇటువంటి అధికారిక కార్యక్రమాలు ఏమీ నిర్వహించలేదు. ఆ అవార్డుల ఎంపికలో పారదర్శకత లేదు' అని శరద్ యాదవ్ తెలిపారు.
గతంలో పద్మ అవార్డుల ఎంపికలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఆనాటి ప్రధాని వాజ్ పేయ్ కి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒక నివేదికను పంపిన విషయాన్ని శరద్ యాదవ్ గుర్తు చేశారు. ఈ సంవత్సరం అవార్డుల ఎంపికకు ఎస్సీ. ఎస్టీ, మైనార్టీలతో పాటు రైతు కుటుంబం నుంచి ఏ ఒక్కరికీ ప్రకటించకపోవడాన్నిశరద్ యాదవ్ తప్పుబట్టారు.పద్మ అవార్డుల ఎంపికలో సచ్ఛీలత అనేది కొట్టొచ్చినట్లు కనబడుతున్న కారణంగా ఆ అవార్డులను నిలిపి వేయాలని శరద్ యాదవ్ డిమాండ్ చేశారు.