అది అపరిపక్వ నిర్ణయమన్న శరద్ యాదవ్
న్యూఢిల్లీః నోట్ల రద్దుపై ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాలతో ఈ నిర్ణయం అపరిపక్వమైనదని తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని జేడీ(యూ) నేత శరద్ యాదవ్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రభుత్వం ఆశయాల్లో ఏ ఒక్కదాన్నీ చేరుకోలేదని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకుని 50 నుంచి 60 శాతం వరకూ ఆదాయాలను కోల్పోయారని అన్నారు.
ప్రభుత్వం ఎలాంటి ముందస్తు కసరత్తు చేపట్టకుండా తీసుకున్న నిర్ణయంతో కోట్లాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదని అన్నారు.