శరద్‌యాదవ్‌.. బల ప్రదర్శన | Sharad Yadav's Show Of Strength With Opposition | Sakshi
Sakshi News home page

శరద్‌యాదవ్‌.. బల ప్రదర్శన

Published Thu, Aug 17 2017 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

శరద్‌యాదవ్‌.. బల ప్రదర్శన - Sakshi

శరద్‌యాదవ్‌.. బల ప్రదర్శన

న్యూఢిల్లీ: జేడీ(యూ) నేత శరద్‌యాదవ్‌ ప్రతిపక్షాలతో కలసి నేడు బల నిరూపణకు దిగనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నుంచి మన్మోహన్‌ సింగ్, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, అహ్మద్‌ పటేల్, గులామ్‌ నబీ ఆజాద్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరీ, సీపీఐ నుంచి డి.రాజా, ఆర్‌జేడీ నుంచి లాలూ ప్రసాద్‌ యాదవ్, సమాజ్‌వాదీ నుంచి అఖిలేశ్‌యాదవ్‌ హాజరవుతున్నట్లు సమాచారం.

 ఈ సందర్భంగా శరద్‌యాదవ్‌ మాట్లాడుతూ.. ‘నైతిక విలువతో కూడిన’ రాజకీయాలు దేశానికి ఆత్మ లాంటివని, దాన్ని మేల్కొలిపేందుకే ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ వేముల మరణం, జేఎన్‌యూ యూనివర్సిటీ విద్యార్థి నజీబ్‌ అహ్మద్, రైతు ఆత్మహత్యలు.. ఇలా పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement