
ఆ విషయమే నాకు తెలియదు: రాజమౌళి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం తెలుగు సినీరంగం నుంచి రాజమౌళిని పద్మ శ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు గాను ప్రభుత్వం ఈ దర్శక ధీరుణ్ని అత్యుతన్నత పురస్కారంతో గౌరవించింది. ఇప్పటికే ఈ గౌరవానికి తాను అర్హుడిని కాదంటూ ప్రకటించిన రాజమౌళి, మరిన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
' గత ఏడాది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పద్మ అవార్డుకు నా పేరును పంపాలని నన్ను సంప్రదించింది. నేను కాదన్నాను. ప్రభుత్వం నాపై చాలా ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే నేను రిక్వెస్ట్ చేయటంతో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పద్మ అవార్డుకు నా పేరును ఎంపిక చేయలేదు. కానీ ఈ సారి మాత్రం నన్ను సంప్రదించకుండానే నా పేరును అవార్డు కమిటీకి పంపారు. ఈ పని ఎవరు చేశారా అని ఆరా తీస్తే, కర్ణాటక ప్రభుత్వం నా పేరును అవార్డుకు పంపినట్టుగా తెలిసింది. నేను పుట్టింది కర్ణాటకలో, చదువుకుంది ఆంద్ర ప్రదేశ్ లో, పని చేసింది తమిళనాట, ప్రస్తుతం ఉంటున్నది తెలంగాణలో ఇన్ని రాష్ట్రాలతో అనుబందం ఉన్నందుకు ఆనందంగా ఉంది' అంటూ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు రాజమౌళి.
Last year the govt of AP wanted to recommend my name for Padma Sri. I requested them not to citing the same reasons. They insisted. But upon
— rajamouli ss (@ssrajamouli) January 26, 2016
my repeated requests, they dropped my name. This year i was not consulted.
— rajamouli ss (@ssrajamouli) January 26, 2016
I was wondering how this happened when I came to know that I was recommended by the Karnataka government.
— rajamouli ss (@ssrajamouli) January 26, 2016
I was born in Karnataka, studied in Andhra Pradesh, worked in Tamil Nadu and settled in Telangana. Happy to be a son of all the states.
— rajamouli ss (@ssrajamouli) January 26, 2016