ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రదానం కోసం 2015 సంవత్సరానికి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రదానం కోసం 2015 సంవత్సరానికి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోగా దరఖాస్తులు పంపవచ్చని కేంద్ర హోంశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత నమూనాలోని నామినేషన్లను, దరఖాస్తుదారు కృషికి సంబంధించి 800 పదాలలోపు సంక్షిప్త లిఖిత పత్రాన్ని జతచేసి..
కేంద్ర హోంశాఖ లేదా కేంద్ర హోంశాఖ కార్యదర్శి కార్యాలయాలకు (నార్త్‌బ్లాక్,న్యూఢిల్లీ-110001) పంపించాలని సూచించింది. నిర్దేశిత న మూనా పత్రాన్ని కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని పేర్కొంది. 2015 సం వత్సరానికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్నారు.