ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ -2025 (IIFA) నామినేషన్స్‌లో బాలీవుడ్ చిత్రాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన ఐఐఎఫ్‌ఏ నామినేషన్స్‌లో అమిర్ ఖాన్, కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా తొమ్మిది విభాగాల్లో లపతా లేడీస్ ఎంపికైంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-2, స్త్రీ-2 చిత్రాలు వరుసగా ఏడు, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచాయి.
ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుక మార్చిలో జరగనుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మార్చి 8, 9 తేదీల్లో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో లాపతా లేడీస్, భూల్ భూలయ్యా- 3, స్త్రీ- 2, కిల్, ఆర్టికల్ 370, షైతాన్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో కిరణ్ రావు, నిఖిల్ నగేష్ భట్, అమర్ కౌశిక్, సిద్ధార్థ్ ఆనంద్, అనీస్ బజ్మీ, ఆదిత్య సుహాస్ ఝంబాలే నిలిచారు. ఉత్తమ నటి కేటగిరీలో నితాన్షి గోయెల్, అలియా భట్, యామీ గౌతమ్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్‌లు పోటీ పడుతుండగా.. ఉత్తమ నటులుగా స్పర్ష్ శ్రీవాస్తవ, రాజ్‌కుమార్ రావు, కార్తీక్ ఆర్యన్, అభిషేక్, బచ్చన్, అజయ్ దేవగన్‌లు నామినేషన్స్ దక్కించుకున్నారు.
సపోర్టింగ్ రోల్ విభాగంలో ఛాయా కదమ్, విద్యాబాలన్, జాంకీ బోడివాలా, జ్యోతిక, ప్రియమణి నిలవగా.. రవి కిషన్, అభిషేక్ బెనర్జీ, ఫర్దీన్ ఖాన్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ పహ్వా మేల్ విభాగంలో పోటీ పడుతున్నారు. బెస్ట్ విలన్ కేటగిరీలో రాఘవ్ జుయల్, ఆర్ మాధవన్, గజరాజ్ రావ్, వివేక్ గోంబర్, అర్జున్ కపూర్ నామినీలుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment