మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి డల్లాస్ లో సన్మానం
టెక్సాస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని ప్రవాస తెలుగు రాష్ట్రాల వాసులు ఘనంగా సన్మానించారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా సన్మానించేందుకు తెలుగు వారు ఓ కార్యక్రమం నిర్వహించారు. 2009లో నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన నీటిపారుదల, ఆరోగ్యశాఖలను నిర్వర్తించారు. నిజామాబాద్ మాజీ ఎంపీ డా.ఆత్మ చరణ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి సేవలను కొనియాడారు.
అజయ్ రెడ్డి ఏలేటి, రఘువీర్ బండారు, ఇతర ముఖ్యనేతలు ఈ కారక్యమంలో పాల్గొన్నారు. సోషల్ యాక్టివిస్ట్ గానూ మంచి గుర్తింపున్న నేత సుదర్శన్ రెడ్డిని సుదర్శనచక్రంతో పోల్చారు. నీటిపారుదల మంత్రిగా సేవలకుగానూ ఆయనను అపర భగీరథుడిగా పిలుస్తారు. సమాజ సేవ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదర్ రెడ్డి కొర్సపాటి, ప్రమోద్ పొద్దుటూరి, రావ్ కల్వల, రామ్ కాసర్ల, ప్రసాద్ తోటకూర, శ్రీనివాస్ గుర్రం, సతీష్ రెడ్డి, సుబ్బు జొన్నలగడ్డ, మహేందర్ కమిరెడ్డి, రాజ్ గోందీ, ప్రవీణ్ బిల్లా, ఎన్ఎంఎస్ రెడ్డి, అల్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ తెలుగు, అశోక్ కొండల, మహేశ్ ఆదిబట్లలు పాల్గొన్నారు. ప్రజా సేవలో సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను సన్మానించినట్టు రామ్ అన్నాడి పేర్కొన్నారు.