
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మ అవార్డు గ్రహీతలు నలుగురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మంగళవారం సన్మానించారు. వివిధ రంగాల్లో 54 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం పద్మ అవార్డులు బహూకరించడం తెలిసిందే. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన దివంగత గోసవీడు షేక్ హసన్ తరఫున ఆయన మనవడు, గరికిపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణ రావు, దర్శనం మొగుల య్యలను సీజేఐ తన నివాసానికి ఆహ్వానించి
సన్మానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.