
Tribute To superstar Krishna Under Alluri Sitaramaraju 125th Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టారు. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించారు. 350పైగా చిత్రాల్లో నటించి సూపర్ స్టార్‌గా ఎదిగారు. నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ఎన్నో మైలు రాళ్లు చేరుకున్న ఘట్టమనేని కృష్ణకు హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్‌తోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నిర్మాతలు అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల గుండెల్లో అల్లూరిసీతరామరాజుగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృష్ణకు సన్మానం చేశారు. అలాగే తన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు విశేషాల్ని పంచుకున్నారు కృష్ణ. 350 చిత్రాల్లో నటించినా అల్లూరి సీతారామరాజు సినిమానే తనకిష్టమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment