నటి సునీతాశెట్టికి ఘన సన్మానం | Senior actress Sunita Shetty Felicitation | Sakshi
Sakshi News home page

నటి సునీతాశెట్టికి ఘన సన్మానం

Published Thu, Mar 3 2016 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

Senior actress Sunita Shetty Felicitation

 బళ్లారి అర్బన్ : సీనియర్ నటి సునీతాశెట్టి సేవలను గుర్తించి బళ్లారి మేరీజాన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా సునీతాశెట్టి మాట్లాడుతూ బళ్లారి ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. బళ్లారి మేరీజాన్ సంస్థ సమాజ సేవలందిస్తోందని, తన లాంటి కళాకారులను గుర్తించి సన్మానించడం హర్షణీయమన్నారు.
 
 ఈ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బళ్లారి మేరీజాన్ సంస్థ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కార్పొరేటర్ సుధాకర్ దేశాయ్, కరవే ఉత్తర కర్ణాటక అధ్యక్షుడు చెన్నబసవరాజ్, వీహెచ్‌పీ నాయకుడు బసవరాజ్, కర్ణాటక ప్రాంత యువ కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీఎం.పాటిల్, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు ఫారుక్‌బాషా, అజయ్, డ్యాన్స్ మాస్టర్ బసవరాజ్, కళాకారిణి సౌమ్య హిరేమఠ్, రాజు హిరేమఠ్, జోగి విజయ్, మహ్మద్, దాదాపీర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement