బాపట్ల టౌన్: వలంటీర్లు పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజల మన్నన పొందగలరని కలెక్టర్ కె.విజయకృష్ణన్ చెప్పారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం బాపట్ల జిల్లాలోని వలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వలంటీర్లు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలకు ఎంపికైన వలంటీర్లను పూలమాలలు, శాలువాలతో సత్కరించి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి పెద్దిరోజా, రెవెన్యూ డివిజనల్ అధికారి జి.రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, బాపట్ల జెడ్పీటీసీ సభ్యురాలు పిన్నిబోయిన ఎస్తేరురాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment